సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (09.09.2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చించనున్నారు.


