సాక్షి, కాకినాడ: చంద్రబాబు అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ నేత కన్నబాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని గాలికొదిలేశారని ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడగడానికి వెళతారన్నారు. కాకినాడలో ఈ రోజు (మంగళవారం) మాజీ మంత్రి వేణుగోపాల కృష్ణతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని గ్రామాల్లో అనధికార కరెంటు కోతలు.. పంటలకు సాగునీరు లేదు రెండేళ్ల కూటమి పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. వచ్చేస్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలో ఎండగట్టడానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు.రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని మాజీ మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల హక్కులను చంద్రబాబు నిర్వీర్యం చేశారని బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించే కుట్రచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


