తిరుపతి: టీటీడీ ఆస్తులను ల్యాండ్‌బ్యాంక్‌గా చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. స్వామివారి ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టవద్దని భూమన స్పష్టం చేశారు. అలాగే గోమాంసానికి అనుమతి ఉన్న ఓ హెటల్‌కు తిరుమలలో పర్మిషన్ ఇవ్వడంపై కూడా భూమన నిలదీశారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేని ఆయన విమర్శించారు. దీనిపై హిందూ సంఘాలంతా కలిసి పోరాడాలని భూమన విజ్ఞప్తి చేశారు.
‘తిరుపతి రూరల్ మండలం లో వందల ఎకరాలు స్థలం ఉంది. అత్యంత విలువైన టిటిడి ఇనామ్ భూమి ఇచ్చింది. 746 జీవో ప్రకారం ఏడు కొండలు టీటీడీ చెందినవి అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చారు. వెలకట్ట లేని 604 సర్వే 1953 వరకు రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. ఎస్వీ అగ్రికల్చర్ 1999 లో 50 ఎకరాలు స్థలం ఏపీ టూరిజంకు అప్పగించారు. సర్వే..588 ఇనామ్ వాణిజ్య అవసరాలకు లావాదేవీలకు రూ. 3వేల కోట్లు విలువైన స్థలం ఇవ్వడం పై టీటీడీ సమాధానం లేదు. దీనికి రూ. 58 కోట్లు పన్నులు మినహాయింపులు ఇచ్చారు, భక్తులు విశ్వాసానికి, నమ్మకానికి మోసం చేశారు
టౌన్ షిప్ కావాలని కోరారో.. అదే స్థలం ముంతాజ్ హోటల్‌కు అప్పగించాలనే కుట్రలో టీటీడీ అధికారులు భాగస్వామ్యం అయ్యారు. టీటీడీ స్థలం వాణిజ్య అవసరాలు అప్పగించే కుట్ర, మూడు దశల్లో చేశారు’ అని పేర్కొన్నారు.
‘టెట్ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’


