ఇబ్రహీంపట్నం పీఎస్‌కు యూట్యూబర్ రమా నందన | YouTuber Rama Nandana To Ibrahimpatnam Police Station | Sakshi
Sakshi News home page

ఇబ్రహీంపట్నం పీఎస్‌కు యూట్యూబర్ రమా నందన

Sep 8 2026 1:48 PM | Updated on Sep 8 2026 2:09 PM

YouTuber Rama Nandana To Ibrahimpatnam Police Station

సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ప్రముఖ యూట్యూబ్‌ చానల్‌ ‘నందూస్‌ వరల్డ్‌’ నిర్వాహకురాలు రమా నందన విచారణకు హాజరయ్యారు. నిన్న(సోమవారం) శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు లో ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్దఎత్తున డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో గతంలోనే నందనతో పాటు ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, అత్తామామలపై కేసు నమోదు చేయ డంతో పాటు లుక్‌ఔట్‌ నోటీసును కూడా జారీ చేశారు. ఇవాళ ఆమె ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు.  

యూకే వీసాల రెన్యువల్ పేరుతో కోట్లలో మోసానికి పాల్పడరంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు బాధితుడు క్రాంతికుమార్ ఫిర్యాదు చేశారు. విచారణకు సహకరిస్తానని 15 రోజుల క్రితం విచారణకు విజయవాడ పోలీస్ కమిషనర్, డీసీనీలకు రమా నందన మెయిల్ చేశారు. ఇండియా వచ్చి విచారణకు సహకరిస్తానని లుక్ అవుట్ నోటీసు తీసేయాలని పోలీసులను మెయిల్‌లో ఆమె కోరారు. లుక్‌ఔట్‌ నోటీసు తీసేయటం కుదరదని విచారణకు రావాలని చెప్పటంతో రమా నందన హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లో  ఇబ్రహీంపట్నం పోలీసులు 41 నోటీసులిచ్చారు. రమా నందన విచారణ పూర్తయ్యాక ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి యూకే నుంచి ఇండియాకు వచ్చి విచారణకు హాజరుకానున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement