తిరుపతి రూరల్: కడుపులో ఏడు నెలల బిడ్డ.. చేతిలో ఒకటిన్నరేళ్ల పసిబిడ్డ.. అయినా భర్త ఉద్యోగం కోసం ఆమె వెనక్కి తగ్గలేదు. కింద కూర్చునే పరిస్థితి లేకపోయినా.. రోజంతా నిల్చునే నిరసన వ్యక్తం చేస్తూ పోరాటం సాగిస్తున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట సోమవారం కనిపించిన ఈ çహృదయవిదారక దృశ్యం చూపరులను కలచివేసింది.
ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ బిల్ కలెక్టర్ల ఉద్యోగులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రిలే, నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. భర్త ఉద్యోగం పోయిందని.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిధిలోని బిల్ కలెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు 22వ రోజు దీక్షా శిబిరానికి చేరుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో బిల్ కలెక్టర్ శివన్న భార్య కళావతి ఏడు నెలల గర్భంతో తన ఒకటిన్నరేళ్ల బిడ్డను తీసుకుని దీక్షా శిబిరానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తన చిన్నారిని ఊయలలో పడుకోబెట్టి ఊపుతూ నినాదాలు మిన్నంటించారు.
చదవండి: అక్కా.. నన్ను చంపేస్తారు..!


