‘డీఎస్సీ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం’ | YSRCP Leader Margani Bharat Challenges Nara Lokesh | Sakshi
Sakshi News home page

‘డీఎస్సీ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం’

Sep 8 2026 12:45 PM | Updated on Sep 8 2026 1:04 PM

YSRCP Leader Margani Bharat Challenges Nara Lokesh

సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలు జరిగినట్టు అధికారులు అంగీకరించారు.. విజిలెన్స్ విచారణ జరుగుతోందని చెప్పారు.. అంటే అక్రమాలు జరిగినట్టు తేలిపోయింది. నారా లోకేష్ తన పదవికి  రాజీనామా చేయాలి’’ అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజిలెన్స్‌తో కాకుండా సీబిఐతో విచారణ జరిపించాలన్నారు.

‘‘ఈ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం ఉంది. 382 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఎవరికిచ్చారో పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలేవీ?. ఇప్పటికీ అక్రమాలను కప్పి పుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?. పచ్చి అబద్దాలతో మంత్రి లోకేష్ అసెంబ్లీని సైతం అవమాన పరిచారు. వైఎస్ జగన్‌కు సవాల్ చేసిన లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. డీఎస్సీ అక్రమాల వెనుక వ్యవస్తీకృత నేరం ఉంది. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే అక్రమాలు చేశారు.

..జూడో అసోసియేషన్ ఛైర్మన్ భరత్ సాక్షాత్తూ నారా లోకేష్ తోడల్లుడే. ఆ అసోసియేషన్ నుండి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇవన్నీ బయట పడాలంటే సీబిఐతో విచారణ జరపాల్సిందే. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. వైఎస్‌ జగన్‌కి సవాల్ చేసే స్థాయి లోకేష్‌కి లేదు. లోకేష్ ఎమ్మేల్యే కాకముందే నేను ఎంపీ అయ్యాను. లోకేష్‌తో చర్చకు నేను సిద్ధం. కరకట్ట ఇల్లయినా, హైదరాబాదు ఇంటికైనా చర్చకు వస్తా. డేటు, టైం లోకేష్ ప్రకటించాలి’’ అని మార్గాని భరత్‌ సవాల్‌ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement