బాత్‌రూంలో ఆరు అడుగుల నాగుపాము కలకలం | 6 Feet Snake In Visakhapatnam | Sakshi
Sakshi News home page

బాత్‌రూంలో ఆరు అడుగుల నాగుపాము కలకలం

Sep 8 2026 8:07 AM | Updated on Sep 8 2026 8:21 AM

6 Feet Snake In Visakhapatnam

విశాఖపట్నం: జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం ఖర్వేల్‌ నగర్‌లో ఓ ఇంటి మరుగుదొడ్డి గదిలోకి ఆరు అడుగుల నాగుపాము చొరబడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్‌ క్యాచర్‌ మేడుకొండ సునీల్‌ ఘటనాస్థలికి చేరుకుని చాకచక్యంగా పామును సురక్షితంగా పట్టుకుని బాటిల్‌లో బంధించారు. అనంతరం పామును అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని తెలిపారు. ఎక్కడైనా పాములు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, వాటిని చంపవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సునీల్‌ సేవలను స్థానికులు అభినందించారు.  

చదవండి: అక్కా.. నన్ను చంపేస్తారు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement