చంద్రబాబు గెలిచి ఓడితే.. మేం ఓడి గెలిచాం: వైఎస్‌ జగన్‌ | YSRCP Chief YS Jagan fires over the conduct of local body elections | Sakshi
Sakshi News home page

చంద్రబాబు గెలిచి ఓడితే.. మేం ఓడి గెలిచాం: వైఎస్‌ జగన్‌

Nov 5 2026 5:11 PM | Updated on Nov 5 2026 5:14 PM

YSRCP Chief YS Jagan fires over the conduct of local body elections

తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు సర్కారు చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని, చివరకు రాత్రికి రాత్రే పోలింగ్‌ శాతాన్ని కూడా పెంచేసి మరీ గెలుపును తమ ఖాతాలో వేసుకున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు గెలిచి ఓడితే.. తాము ఓడి, గెలిచామన్నారు వైఎస్‌ జగన్‌.  ఎన్నికలు సజావుగా సాగితే చంద్రబాబు ఎందుకు గెలుస్తారని ప్రశ్నించారు. 

వీటికి అర్ధం ఏమిటి చంద్రబాబూ..?
‘చంద్రబాబు వీటిని గెలుపుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. విశాఖలో రాత్రికి రాత్రే 1,15,887 ఓట్లు ఎలా పెరిగాయి. సోమవారం ఉదయానికి 10, 35, 154 ఓట్లు ఎలా పడ్డాయి. రాత్రి 51.46 శాతం అయితే ఉదయానికి 56.03 శాతానికి పెంచారు?, బ్యాలెట్‌ బాక్సుల స్ట్రాంగ్‌ రూమ్‌లకు కూడా సీల్‌ వేయలేదు. 

చీమకుర్తిలో రాత్రి 11 గంటలకు 78.28 శాతం,, రాత్రి 12 గంటలకు పోలింగ్‌ శాతం 84.36 శాతం​ పెంచారు. జమ్మలమడుగులో ఉ. 11గం.లకు 60 శాతం పోలింగ్‌ ఎలా సాధ్యం?, అద్దంకిలో ఉ 11 గంటలకి 19 శాతం.. మధ్యాహ్నం ఒంటి గంటకు 56 శాతమా?, ధర్మవరంలో 2 గంటల్లో 8 నుంచి 36. 36 శాతానాకి ఎలా పెరిగింది?, పార్వతీపురంలో 2 గంటల్లో 12 శాతం నుంచి 44 శాతానికి పెరిగింది?

పోలింగ్‌ శాతాను పెంచి.. రిగ్గింగ్‌ చేశారు. నామినేషన్లు రిగ్గింగ్‌.. స్క్రూటినీ రిగ్గింగ్‌ చేశారు. పోలింగ్‌ బూత్‌ల రిగ్గింగ్‌.. పోలింగ్‌ సైక్లింగ్‌  రిగ్గింగ్‌. పోలింగ్‌ పర్సంటేజ్‌లు.. బ్యాలెట్‌ బాక్సులు సైతం రిగ్గింగ్‌ చేశారు. ఇవన్నీ దాటుకుని మా వాళ్లు గెలిస్తే.. ఆ ఫలితాలను కూడా రిగ్గింగ్‌ చేశారు’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. జెన్‌ జీ తరంలోనూ రిగ్గింగ్‌, సైక్లింగ్‌ ఎలా చేయాలో ట్యూషన్లు పెట్టి మరీ చంద్రబాబు నేర్పించారని ఎద్దేవా చేశారు వైఎస్‌ జగన్‌.

చంద్రబాబు హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌ ఫర్‌ సేల్‌..
చంద్రబాబు హయాంలోనే ఏపీ ఫర్‌ సేల్‌గా మారిపోయింది. ప్రభుత్వ భూములను 99 పైసలకే కట్టబెట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లిక్కర్‌, గంజాయే. రాజధాని సహా అన్నింటిలోనూ స్కాంలే చేశారు. ఏపీని సౌత్‌ బిహార్‌తో పోలుస్తున్నారు’ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్వం చేశారు. 

‘ప్రజల తరఫున బలంగా గొంతు విప్పాం. .చంద్రబాబు అక్రమాaను దేశం దృష్టికి తీసుకెళ్లాం. మా కార్యకర్తలను, నేతల హీరోల్లా పోరాటం చేశారు.. వారికి సెల్యూట్‌’ అని వైఎస్సార్‌సీపీ శ్రేణుల పోరాటాన్ని ప్రశంసించారు. 

మురుసు తుపాన్‌ ఉన్నా ఎన్నికలను వాయిదా వేయలేదు..
‘ఒకవైపు మురసు తుపాన్‌ ఉన్నా ఎన్నికలను వాయిదా వేయలేదు.   తుపాన్‌ సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రాధాన్యం. అర్నబ్‌ తుపాను కారణంగా 10మందికి పైగా చనిపోయారు. 150 గ్రామాలకు ఇప్పటికీ కరెంట్‌ లేదు.. మురసు తుపాన్‌ కారణంగా ఇద్దరు చనిపోయారు. రైతులు తీవ్రంగా నష్టపోయినా సాయం చేయలేదు. 13 నెలల కింద మోంథా తుపాన్‌ నష్టపరిహారం ఇవ్వలేదు. జీవోలు  ఇచ్చారు కానీ.. డబ్బులు ఇవ్వలేదు’ అని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

ఇదీ చదవండి: మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement