లోకేశ్‌.. ఇది సిగ్గు చేటు: కొండా రాజీవ్‌ | Konda Rajiv Slams CBN Lokesh Over DSC Issue | Sakshi
Sakshi News home page

లోకేశ్‌.. ఇది సిగ్గు చేటు: కొండా రాజీవ్‌

Sep 8 2026 1:55 PM | Updated on Sep 8 2026 2:10 PM

Konda Rajiv Slams CBN Lokesh Over DSC Issue

సాక్షి, తాడేపల్లి : దేశంలో ఎక్కడా లేని విధంగా దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇవ్వటం ఏపీలోనే చూస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ అన్నారు. డీఎస్సీలో అవకతవకలు జరిగినట్లు సాక్ష్యాలు బయటపడినా.. ఎదురు దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారాయన. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 

డీఎస్సీలో అక్రమాలు చేసి టీడీపీ నేతలు దొరికి పోయారు. సాక్ష్యాలు బయటపడినా  ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిగితే నారా లోకేష్ జైలుకే వెళ్తారు. అక్రమాలు బయట పడినా లోకేష్ పై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. ఒకప్పుడు వైఎస్‌ జగన్‌పై ఆరోపణలు చేస్తే సీబీఐతో విచారణ జరిపించుకోమని వైఎస్ఆర్ సవాల్ చేశారు. మరి లోకేష్ పై ఆధారాలతో బయటపడినా ఎందుకు వెనుకేసుకు వస్తున్నారు?. చంద్రబాబు వెంటనే లోకేష్‌తో రాజీనామా చేయించాలి అని రాజీవ్‌ అన్నారు..  

దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఉవ్వటం ఏపీలోనే చూస్తున్నాం. మా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీపై కూడా సీబీఐ విచారణకు మేం సిద్ధమంటున్నా కూడా వాళ్ల దగ్గరి నుంచి స్పందన లేదు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. ఉద్యోగం ఇచ్చే ముందు సర్టిఫికేట్ల విచారణ చేయాలి. కానీ ఇష్టానుసారం ఉద్యోగాలు అమ్మేసుకుని ఇప్పుడు సర్టిఫికేట్ల విచారణ చేస్తామంటారా?. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిని ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది?. వారిపై చర్యలు తీసుకుబే దమ్ము ప్రభుత్వానికి లేదు. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఫేక్  వాళ్లు బయటకు వచ్చి ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారో బయట పెడతారోనని భయం.. 

.. పైగా ప్రశ్నించిన మీడియాపై  కేసులు పెడతున్నారు. నారా లోకేష్ సవాల్‌పై చర్చించటానికి మా మాజీ మంత్రులు సిద్ధమే. అది చూసి ఆయన భయంతో పారిపోయారు. సవాల్ చేసిన నారా లోకేష్ మహిళలను అడ్డం పెట్టి మాట్లాడించటం ఎందుకు?. ఇది సిగ్గుచేటు అని కొండా రాజీవ్‌ అన్నారు.

ఇదీ చదవండి: జనసేనకు షాకిచ్చిన టీడీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement