విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాద ఛాయలు | Electric Shock Man Dies In Andhra Pradesh Nandaluru | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాద ఛాయలు

Sep 8 2026 11:28 PM | Updated on Sep 8 2026 11:28 PM

Electric Shock Man Dies In Andhra Pradesh Nandaluru

వైఎస్ఆర్: జిల్లాలోని నందలూరు మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నందలూరు మండలం వెంకట రాజంపేట గ్రామానికి చెందిన చింతకాయల వెంకటరతయ్య (40) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరతయ్య పని నిమిత్తం తన పొలంలో ఉన్నటువంటి కరెంటు మోటార్ గదిలోనికి వెళ్లాడు. అయితే, అతను  వెళ్లిన గదిలో విద్యుత్‌ తీగలు వేలాడుతున్నట్లుగా ఉన్నాయి. అయితే, ప్రమాదావశాత్తు ఆ కరెంటుతీగలు అతనికి తగిలాయి. దీంతో వెంకటరతయ్య ఒక్కసారిగా తీవ్ర విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ విషయం గురించి సమాచారం అందుకున్న నందలూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, విద్యుత్ వైరు ఎలా తగిలింది, విద్యుత్ మోటార్ గదిలో భద్రతా చర్యలు ఉన్నాయా లేదా అనే అంశాలపై పోలీసులు విచారణకై  మృతదేహాన్ని పోస్టుమార్టంకోసం ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement