breaking news
Mahesh Chandra
-
10న నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక
సాక్షి, హైదరాబాద్: నాయి బ్రాహ్మణ యువతీ యువకుల వివాహ సంబంధాల కోసం పరిచయ కార్యాక్రమం ఈనెల 10న జరగనుంది. ఆదివారం దిల్షుక్నగర్ కొత్తపేటలోని బాబు జగ్జీవన్రామ్ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మహేష్ చంద్ర నాయి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిచయ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న నాయి బ్రాహ్మణలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పునర్వివివాహ సంబంధాల కోసం చూస్తున్న వితంతువులు, డైవోర్సిలు కూడా తమకు నచ్చిన భాగస్వామిని ఈ వివాహ పరిచయ కార్యక్రమం ద్వారా వెతుక్కునే అవకాశముందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 9849566988, 9391357109 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. -
నాలుగు భాషల్లో రెడ్ అలర్ట్
‘‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విలక్షణమైన ఇతివృత్తంతో ఈ సినిమా చేస్తున్నాం. సినీ నిలయ క్రియేషన్స్ సంస్థ ద్వారా ప్రతిభావంతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని నిర్మాత పీవీ శ్రీరాంరెడ్డి చెప్పారు. చంద్రమహేశ్ దర్శకత్వంలో హెచ్.హెచ్. మహాదేవ్, అంజనామీనన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘రెడ్ అలర్ట్’. ఇప్పటికి 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో చంద్రమహేశ్ మాట్లాడుతూ -‘‘హీరో, హీరోయిన్, కాశీ విశ్వనాథ్ మినహా ఏ భాషకు చెందిన నటీనటులతో ఆ భాషలో చిత్రీకరణ జరిపాం. యాక్షన్ థ్రిల్లర్ విత్ కామెడీ ఇది. నిర్మాత సహకారంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాం’’ అని తెలిపారు. మహాదేవ్ మాట్లాడుతూ -‘‘కథ విని ఉద్వేగానికి గురయ్యాను. నవంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటులు కాశీ విశ్వనాథ్, కాదంబరి కిరణ్, శుభోదయం వరప్రసాద్, సాయినరేశ్, తేజ, అమర్, రచయిత శ్రీరామ్ చౌదరి, సంగీత దర్శకుడు రవివర్మ, ఛాయాగ్రాహకుడు కల్యాణ్ సమి, సమర్పకుడు త్రిలోక్ రెడ్డి తదితరులు మాట్లాడారు.