వాతావరణం అనుకూలించక పోవడమే కారణం
గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో శనివారం ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా చెన్నై నుంచి వచ్చిన విమానాన్ని దారి మళ్లించారు. చెన్నై నుంచి 65 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం ఉదయం 8.40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ గగనతలంలోకి చేరుకుంది. ఆ సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని వర్షం కురుస్తుండడంతో రన్‌వే విజిబులిటి లేక విమానం అరగంట పాటు గాలిలో చక్కర్లు కొట్టింది.
అయినప్పటికి వాతావరణం అనుకూలించకపోవడంతో విమానంలోని ఇంధన నిల్వ దృష్ట్యా అధికారుల సూచన మేరకు రాజమండ్రి విమానాశ్రయానికి దారి మళ్లించారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత విమానం రాజమండ్రి నుంచి తిరిగి బయలుదేరి ఉదయం 11 గంటలకు గన్నవరం చేరుకుంది.


