వెండి రూ. 5,000 డౌన్‌ | Silver prices drop over Rs 5000 and gold slips drop Rs 2100 | Sakshi
Sakshi News home page

వెండి రూ. 5,000 డౌన్‌

Feb 18 2026 3:32 AM | Updated on Feb 18 2026 12:21 PM

Silver prices drop over Rs 5000 and gold slips drop Rs 2100

రూ. 2,200 నష్టపోయిన పసిడి 

  న్యూఢిల్లీ: పసిడి, వెండిలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఫలితంగా మంగళవారం ఢిల్లీ మార్కెట్లో వెండి మరో రూ.5,000 నష్టపోయి (2 శాతం) రూ.2,45,000 స్థాయికి దిగొచ్చింది. అటు  బంగారం సైతం 10 గ్రాములకు రూ.2,200 నష్టంతో (1.4 శాతం) రూ.1,57,000కు పరిమితమైంది. అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో వెండి ఔన్స్‌కు 1.65 డాలర్లు (2.15 శాతం) తగ్గి 74.96 డాలర్ల వద్ద, పసిడి ఔన్స్‌కు ఒక శాతం నష్టపోయి 4,938.70 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.

‘‘స్పాట్‌ బంగారం ధరలు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. అమెరికా–ఇరాన్‌ చర్చలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు’’అని మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ కమోడిటీస్‌ హెడ్‌ ప్రవీణ్‌ సింగ్‌ తెలిపారు. చైనా కొత్త సంవత్సరం సెలవులు కావడంతో కొనుగోళ్ల ఆసక్తి తగ్గినట్టు.. పసిడికి 5,000 డాలర్ల పైన అమ్మకాల ఒత్తిడి ఎదురైనట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీ విభాగం సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. మెటల్స్‌లో లిక్విడిటీ తగ్గిందని.. స్పెక్యులేషన్‌ పెరగనంత వరకు ధరలు ఒక పరిమిత శ్రేణిలోనే కొనసాగొచ్చన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement