
గ్లోబల్ డిజిటల్ ఇంజినీరింగ్ కంపెనీ నగారో వచ్చే 12–18 నెలల్లో 1,000 మంది పైగా నిపుణులను నియమించుకునే యోచనలో ఉంది. హైదరాబాద్, బెంగళూరు, పుణె సహా కీలక హబ్‌లలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు సంస్థ తెలిపింది. కంపెనీకి ప్రస్తుతం భారత్‌లో 13,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు నగారో సీఈవో మానస్ హుమాన్ వివరించారు.
స్టార్టప్‌లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) హైరింగ్ పెరగడంతో మార్కెట్లో నిపుణుల కొరత నెలకొందని, అయితే అంతర్జాతీయ అనిశ్చితులపై ఆందోళన వల్ల ఉద్యోగాలు మారే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు మానస్ తెలిపారు. అంతర్జాతీయంగా వాణిజ్య, టారిఫ్‌లపరమైన అనిశ్చితులు ప్రభావం చూపుతున్నాయని వివరించారు.