ఆ ఫీచర్‌ బంద్‌: గూగుల్ పే, ఫోన్‌పే.. యాప్‌లలో కీలక మార్పు | End Of UPI Scams Payment Request Will Stop On Google Pay And PhonePe From October | Sakshi
Sakshi News home page

ఆ ఫీచర్‌ బంద్‌: గూగుల్ పే, ఫోన్‌పే.. యాప్‌లలో కీలక మార్పు

Aug 20 2025 4:52 PM | Updated on Aug 20 2025 7:36 PM

End Of UPI Scams Payment Request Will Stop On Google Pay And PhonePe From October

యూపీఐ మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 ‘పేమెంట్ రిక్వెస్ట్’ ఫీచర్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లలో ఈ మార్పు అమలులోకి రానుంది.

మోసాల వెనుక ఉన్న మెకానిజం
‘పేమెంట్ రిక్వెస్ట్’ అనే ఫీచర్‌ను మోసగాళ్లు దుర్వినియోగం చేస్తూ, డబ్బు పంపుతున్నట్టు చూపించి, వినియోగదారుల నుంచి డబ్బు తీసుకుంటున్నారు.  
ఓఎల్‌ఎక్స్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లలో వాడుక వస్తువుల కొనుగోలు సందర్భాల్లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వినియోగదారులు డబ్బు వస్తుందనుకుని, రిక్వెస్ట్‌ను అంగీకరించడం వల్ల వారి ఖాతాల్లోని డబ్బు మోసగాళ్లకు చేరుతోంది.

యాప్‌లు అప్‌డేట్‌ చేసుకోవాలి..
ఎన్‌పీసీఐ ఆదేశాల మేరకు, అక్టోబర్ 2 నుంచి ఈ ఫీచర్‌ను పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా యూపీఐ యాప్‌లు తమ సిస్టమ్‌లను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు డిజిటల్ లావాదేవీల భద్రతను పెంచే దిశగా కీలక అడుగులుగా ఎన్‌పీసీఐ భావిస్తోంది.

ఇదీ చదవండి: రైలు టికెట్లు రయ్‌మని బుక్‌ అయ్యేలా.. కొత్త అప్‌గ్రేడ్‌ వస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement