
సిరిసిల్ల : కార్మికక్షేత్రం సిరిసిల్ల గోవిందా నామస్మరణతో పులకించింది. మంగళవారం జిల్లా కేంద్రంలోని వెంకన్న రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరువీధులన్నీ భక్తజన సంద్రమయ్యాయి.

తిరుమలేశుడికి అనుబంధంగా ఇక్కడ కొలువు దీరిన శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవం కన్నుల పండువగా కొనసాగింది.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రథోత్సవంలో పాల్గొని పూజలు జరిపారు.

ఉదయం 4గంటల నుంచి దేవదేవుడు రథంపై రాత్రి 9గంటల వరకు దర్శనమిచ్చారు. రథోత్సవంలో సుమారు లక్షమంది భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.



















