
భారతదేశంలో కస్టమర్ సపోర్ట్, మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరచడానికి షావోమి ప్రధాన నగరాల్లో 10 ప్రీమియం సర్వీస్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇది భారత మార్కెట్ పట్ల కంపెనీ దీర్ఘకాలిక నిబద్ధతను బలోపేతం చేస్తుందని చెప్పింది. కంపెనీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, జైపూర్, ముంబై, పుణె, అహ్మదాబాద్‌ల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్‌లో కేంద్రాలు ప్రాథమికంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
భవిష్యత్తులో దేశవ్యాప్తంగా 100 ప్రీమియం సర్వీస్ సెంటర్లకు విస్తరించాలని సంస్థ యోచిస్తోంది. ఈ సందర్భంగా షావోమి ఇండియా సీఈవో సుధీన్ మాథుర్ మాట్లాడుతూ..‘కంపెనీ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం కంటే మమ్మల్ని విశ్వసించే వ్యక్తులతో శాశ్వత సంబంధాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగానే ఈ ప్రీమియం సర్వీస్ సెంటర్లను ప్రారంభించాని నిర్ణయించాం’ అని చెప్పారు.
ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి!