
ప్రీమియం హోటళ్లు, హోమ్‌స్టే బ్రాండ్లను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఓయో మాతృ సంస్థ ప్రిజం ప్రత్యేకంగా ’చెకిన్’ పేరిట కొత్త విభాగాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రీమియం హోటళ్లు, సండే హోటల్స్, క్లబ్‌హౌస్, పాలెట్, చెక్‌మైగెస్ట్, డ్యాన్సెంటర్, బెల్‌విల్లా తదితర బ్రాండ్స్ ఉంటాయి.
ఓయో ఏ విధంగానైతే బడ్జెట్ ట్రావెల్‌కి పర్యాయపదంగా మారిందో చెకిన్ కూడా అదే విధంగా ప్రీమియం హోటళ్లు, హోమ్స్‌కి గ్లోబల్ బ్రాండ్‌గా ఉంటుందని ప్రిజం వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తెలిపారు. ప్రాథమికంగా చెకిన్ భారత్‌లో అందుబాటులో ఉంటుందని, దశలవారీగా రాబోయే నెలల్లో అంతర్జాతీయంగా కూడా ప్రవేశపెడతామని పేర్కొన్నారు.
తమ అధ్యయనం ప్రకారం 55 శాతం మంది మరింత నాణ్యమైన, లగ్జరీ అనుభూతిని అందించే హోటళ్లకు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడైందని ప్రిజం తెలిపింది.