breaking news
check in
-
ప్రయాణికులకు చుక్కలు చూపిన ఎయిరిండియా!
ఎయిరిండియా విమానయాన సంస్థ తన ప్రయాణికులకు చుక్కలు చూపించింది. పలు ఎయిర్‌పోర్టులలో పడిగాపులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితికి వివరణ ఇస్తూ ఎయిర్‌లైన్స్ తర్వాత ఒక ప్రకటనలో స్పష్టత ఇచ్చింది. మంగళవారం సాయంత్రం తర్వాత పలు ఎయిర్‌పోర్టులలో ఎయిరిండియా ప్యాసింజర్ల చెక్ ఇన్ను అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో క్యూ లైన్లలో ప్రయాణికులు చాలాసేపు ఎదురు చూశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇది చోటు చేసుకుందని ఆ తర్వాత ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. థర్డ్ పార్టీ సిస్టమ్‌లో సమస్య కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని.. ఆ సమస్యను పరిష్కరించామని.. ఇప్పుడంతా సర్వసాధారణ పరిస్థితి నెలకొందని.. రాకపోకలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. #UpdateThe third-party system has been fully restored, and check-in at all airports is functioning normally. All our flights are operating as per schedule.We thank our passengers for their understanding.— Air India (@airindia) December 2, 2025ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్24 ప్రకారం.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని విమానాలు ఆలస్యం కాగా.. మరికొన్ని పూర్తిగా రద్దయ్యాయి. ఇదిలా ఉంటే.. కిందటి నెలలోనూ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో టెక్నికల్ ఇష్యూ తలెత్తి సుమారు 800 విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దానికి కొన్ని రోజులముందు జీపీఎస్ స్పూఫింగ్ (GPS spoofing) జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ స్పూఫింగ్ నిజమేనని, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) మార్చేందుకు యత్నాలు జరిగినట్టు కేంద్రం ధ్రువీకరించింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. సోమవారం రాజ్యసభలో పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఈ మేరకు ప్రకటన చేశారు.నేవిగేషన్ వ్యవస్థను ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ అంటారు. నిజమైన శాటిలైట్ సిగ్నల్స్‌ను అడ్డుకొని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్ రిసీవర్‌ను తప్పుదోవ పట్టిస్తాయి. ఫలితంగా.. ప్రస్తుతమున్న ప్రదేశం, సమయాన్ని తప్పుగా చూపించేలా చేస్తాయి. పౌర విమానాలే లక్ష్యంగా అంతర్జాతీయ రూట్లలో ఈ తరహాలో జరిగిన సైబర్ దాడులు తరచూ వెలుగుచూస్తున్నాయి. దేశంలో నవంబర్ 2023- ఫిబ్రవరి 2025 మధ్యకాలంలో 465 జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు నమోదైనట్లు అంచనా. -
ప్రీమియం హోటల్స్ కోసం ఇక ఓయో ‘చెకిన్’
ప్రీమియం హోటళ్లు, హోమ్‌స్టే బ్రాండ్లను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఓయో మాతృ సంస్థ ప్రిజం ప్రత్యేకంగా ’చెకిన్’ పేరిట కొత్త విభాగాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రీమియం హోటళ్లు, సండే హోటల్స్, క్లబ్‌హౌస్, పాలెట్, చెక్‌మైగెస్ట్, డ్యాన్సెంటర్, బెల్విల్లా తదితర బ్రాండ్స్ ఉంటాయి.ఓయో ఏ విధంగానైతే బడ్జెట్ ట్రావెల్‌కి పర్యాయపదంగా మారిందో చెకిన్ కూడా అదే విధంగా ప్రీమియం హోటళ్లు, హోమ్స్‌కి గ్లోబల్ బ్రాండ్‌గా ఉంటుందని ప్రిజం వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తెలిపారు. ప్రాథమికంగా చెకిన్ భారత్‌లో అందుబాటులో ఉంటుందని, దశలవారీగా రాబోయే నెలల్లో అంతర్జాతీయంగా కూడా ప్రవేశపెడతామని పేర్కొన్నారు.తమ అధ్యయనం ప్రకారం 55 శాతం మంది మరింత నాణ్యమైన, లగ్జరీ అనుభూతిని అందించే హోటళ్లకు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడైందని ప్రిజం తెలిపింది. -
ఓయో సంచలన నిర్ణయం.. ఆ జంటలకు నో రూమ్
ప్రముఖ ట్రావెల్, హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఓయో (OYO) పెళ్లికాని జంటలకు షాకిచ్చింది. ఇకపై పెళ్లి కాని జంటలకు రూమ్స్ బుకింగ్స్ లేదంటూ తేల్చిచెప్పింది. ఈమేరకు తన భాగస్వామి హోటల్లకు చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది.ఇకపై పెళ్లి కాని యువతీ, యువకులు ఓయో రూమ్స్ లో చెక్ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్‌షిప్‌కు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్స్ అడగనుంది. సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్‌ను తిరస్కరించే అధికారాన్ని పార్టనర్ హోటల్స్‌కు ఇస్తున్నట్టు ఓయో చెప్పుకొచ్చింది.మొదటగా మీరట్ నుంచి..మొదటగా ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని ఓయో భాగస్వామి హోటల్స్‌లో కొత్త చెక్ ఇన్ పాలసీని ప్రారంభించింది. అక్కడ నుంచి వచ్చే గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ కొత్త రూల్‌ని దేశంలోని మరిన్ని నగరాలలో అమలు చేయనుంది. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఓయో రూమ్స్ ఉపయోగించిన వారి సంఖ్య 10 లక్షలు దాటింది. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 58 శాతం పెరిగింది.పెళ్లికాని జంటలు విచ్చలవిడిగా ఓయో రూమ్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని, దీన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పౌర సమాజ సమూహాల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. ఓయో రూమ్స్ దుర్వినియోగంపై ముఖ్యంగా మీరట్‌లో పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. దీంతో అక్కడ నుంచే ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఓయోపై ఉన్న పాత అభిప్రాయాలను మార్చడం, కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు, మతపరమైన, ఒంటరి ప్రయాణీకులకు సురక్షితమైన అనుభూతిని అందించే బ్రాండ్‌గా తనను తాను రూపొందించుకోవడం లక్ష్యంగా కంపెనీ ఈ చొరవ తీసుకున్నట్లు ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ పేర్కొన్నారు.సురక్షితమైన ఆతిథ్య పద్ధతులపై పోలీసులు, హోటల్ భాగస్వాములతో కలిసి సదస్సులను నిర్వహించడంతోపాటు అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహించే హోటళ్లను బ్లాక్‌లిస్ట్ చేయడం, ఓయో బ్రాండింగ్‌ని అనధికారిక ఉపయోగించే హోటళ్లపై చర్యలు తీసుకోవడం వంటి అనేక దేశవ్యాప్త కార్యక్రమాలను ఓయో ప్రారంభించింది. -
ఇండిగో కొత్త బాదుడు : మంత్రిత్వ శాఖ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులపై భారీ వడ్డింపునకు సిద్ధమైంది. విమానాశ్రయాల్లో భారీ క్యూలను తగ్గించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకుద్దేశించిన వెబ్ చెక్ ఇన్ అవకాశంపై భారీగా చార్జీలను వసూలు చేయనుంది. వెబ్ చెక్ఇన్ చేసుకునే అన్నిఅన్ని విమాన టికెట్లపై చార్జీ ఉంటుందని ఇండిగో ప్రయాణికుడికి సమాధానంగా ట్విటర్లో వెల్లడించింది. ప్రయాణికుడు ఎంచుకున్న సీటు ఆధారంగా ఈ ఫీజు 200-1000 రూపాయల దాకా ఉండనుంది. సవరించిన తమ కొత్త విధానం ప్రకారం ఈ చార్జి చెల్లించాల్సి ఉంటుందనీ, అయితే ఎయిర్పోర్ట్ ఈ సదుపాయం ఉచితమేనని స్పష్టం చేసింది. దీనిపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మరోవైపు ఈ పరిణామంపై విమానయాన శాఖ స్పందించింది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సీనియర్ అధికారి తెలిపారు. ఈ కొత్త మార్పు నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అనేది సమీక్షించనున్నామని ఏవియేషన్ కార్యదర్శి ఆర్ ఎన్ చౌబే వెల్లడించారు. కాగా ఇండిగో, జెట్ ఎయిర్వేస్, కొన్ని సీట్లపై మాత్రమే వెబ్ చెక్ ఇన్ ఫీజును వస్తూలు చేస్తుండగా, స్పైస్‌జెట్ అన్నిటికీ చేస్తుంది. అలాగే విస్తారా ఎయిర్‌లైన్స్ లోవెబ్ చెక్ ఇన్ పూర్తిగా ఉచితం. వెబ్ చెక్ ఇన్: దేశీయంగా విమాన టికెట్‌ను బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆన్లైన్లోనే వివరాల పరిశీలనతోపాటు, బోర్డింగ్ పాస్‌ను కూడా ఈ వెబ్ చెక్ఇన్ ద్వారా పొందవచ్చు. MoCA has noted that airlines are now charging for web check-in for all seats. We are reviewing these fees to see whether they fall within the unbundled pricing framework. — Ministry of Civil Aviation (@MoCA_GoI) November 26, 2018 -
పనుల పరిశీలన
మాగనూర్ : మండలంలోని కృష్ణ రైల్వేస్టేషన్ ఆవరణలో భక్తుల కోసం నిర్మిస్తున్న తాత్కాలిక షెడ్లు, బుకింగ్ కౌంటర్, మరుగుదొడ్లను ఆదివారం ఎస్ఐ నర్సయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ గాంధీ, స్టేషన్ మేనేజర్ కేవీకే రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రశేఖర్, హెడ్‌కానిస్టేబుల్ రాఘవేందర్‌రెడ్డి, రైల్వే కానిస్టేబుల్ విక్రం తదితరులు పాల్గొన్నారు. -
పనుల పరిశీలన
\పనుల పరిశీలన రైల్వే స్టేషన్, పరిశీలన మాగనూర్ : మండలంలోని కృష్ణ రైల్వేస్టేషన్ ఆవరణలో భక్తుల కోసం నిర్మిస్తున్న తాత్కాలిక షెడ్లు, బుకింగ్ కౌంటర్, మరుగుదొడ్లను ఆదివారం ఎస్ఐ నర్సయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ గాంధీ, స్టేషన్ మేనేజర్ కేవీకే రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రశేఖర్, హెడ్‌కానిస్టేబుల్ రాఘవేందర్‌రెడ్డి, రైల్వే కానిస్టేబుల్ విక్రం తదితరులు పాల్గొన్నారు.


