25.52% విక్రయించనున్న ఐహెచ్‌సీఎల్
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ కంపెనీ(ఐహెచ్‌సీఎల్) భాగస్వామ్య సంస్థ తాజ్ జీవీకేలోగల 25.52 శాతం వాటా విక్రయించనుంది. ప్రమోటర్లు జీవీకే–భూపాల్ కుటుంబానికి ఈ వాటాను అమ్మివేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐహెచ్‌సీఎల్ వెల్లడించింది. దీంతో ప్రమోటర్లుగా జీవీకే–భూపాల్ కుటుంబం తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్‌లో 74.99 శాతం వాటా పొందనుంది.
కంపెనీ ఐదేళ్ల ప్రణాళిక(యాక్సెలరేట్ 2030)లో భాగంగా అసెట్‌లైట్ క్యాపిటల్ వ్యూహాలను అమలు చేయనున్నట్లు ఐహెచ్‌సీఎ ల్ ఎండీ, సీఈవో పునీత్ చత్వాల్ పేర్కొ న్నారు. వెరసి జీవీకే–భూపాల్ కుటుంబంతో దీర్ఘకాలిక మేనేజ్‌మెంట్ కాంట్రాక్టు అమలు చేయనున్నట్లు తెలియజేశారు.
కాగా.. భవిష్యత్ వృద్ధి అవకాశాలలో భాగంగా ఐహెచ్‌సీఎల్‌తో 2025 అక్టోబర్‌లో 256 గదుల తాజ్ యెలహంక (బెంగళూ రు) కోసం యాజమాన్య కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు తాజ్ జీవీకే హోటల్స్ జేఎండీ కృష్ణ భూపాల్ తెలియజేశారు. 2026లో ప్రారంభకానున్న ఈ హోటల్‌తోపాటు.. తాజ్ జీవీకే పోర్ట్‌ఫోలియోలో హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్, తాజ్ క్లబ్‌హౌస్ (చెన్నై), తాజ్ చండీగఢ్, వివాంతా హైదరాబాద్(బేగంపేట) ఉన్నాయి.


