breaking news
Taj GVK Hotels
-
తాజ్ జీవీకేలో ప్రమోటర్ల వాటా అప్
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ కంపెనీ(ఐహెచ్‌సీఎల్) భాగస్వామ్య సంస్థ తాజ్ జీవీకేలోగల 25.52 శాతం వాటా విక్రయించనుంది. ప్రమోటర్లు జీవీకే–భూపాల్ కుటుంబానికి ఈ వాటాను అమ్మివేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐహెచ్‌సీఎల్ వెల్లడించింది. దీంతో ప్రమోటర్లుగా జీవీకే–భూపాల్ కుటుంబం తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్‌లో 74.99 శాతం వాటా పొందనుంది. కంపెనీ ఐదేళ్ల ప్రణాళిక(యాక్సెలరేట్ 2030)లో భాగంగా అసెట్‌లైట్ క్యాపిటల్ వ్యూహాలను అమలు చేయనున్నట్లు ఐహెచ్‌సీఎ ల్ ఎండీ, సీఈవో పునీత్ చత్వాల్ పేర్కొ న్నారు. వెరసి జీవీకే–భూపాల్ కుటుంబంతో దీర్ఘకాలిక మేనేజ్మెంట్ కాంట్రాక్టు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. కాగా.. భవిష్యత్ వృద్ధి అవకాశాలలో భాగంగా ఐహెచ్‌సీఎల్‌తో 2025 అక్టోబర్‌లో 256 గదుల తాజ్ యెలహంక (బెంగళూ రు) కోసం యాజమాన్య కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు తాజ్ జీవీకే హోటల్స్ జేఎండీ కృష్ణ భూపాల్ తెలియజేశారు. 2026లో ప్రారంభకానున్న ఈ హోటల్‌తోపాటు.. తాజ్ జీవీకే పోర్ట్‌ఫోలియోలో హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్, తాజ్ క్లబ్‌హౌస్ (చెన్నై), తాజ్ చండీగఢ్, వివాంతా హైదరాబాద్(బేగంపేట) ఉన్నాయి. -
తాజ్‌జీవీకే హోటల్స్‌కు నష్టం
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగంలో ఉన్న తాజ్‌జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.4.5 కోట్ల నష్టం మూటగట్టుకుంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.5.15 కోట్ల నికరలాభం పొందింది. టర్నోవర్ రూ.76 కోట్ల నుంచి రూ.46 కోట్లకు వచ్చి చేరింది. 2020–21లో రూ.97 కోట్ల టర్నోవర్‌పై రూ.39 కోట్ల నష్టం వాటిల్లింది. -
ఇండియన్ హోటల్స్ లో తాజ్ జీవీకే విలీనం?
టాటా గ్రూపు సంస్థ , హైదరాబాద్ ఆధారిత జీవీకే, ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ల జాయింట్ వెంచర్ సంస్థ అయిన తాజ్ జీవీకే హోటల్స్ & రిసార్ట్స్ ను ఇండియన్ హోటల్స్ విలీనం చేసుకోనుందట. తాజ్ జీవీకే పూర్తి స్వాధీనానికి ఇండియన్ హోటల్స్ సిద్ధపడుతున్నట్టు వ్యాపార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందుకు రెండు సంస్థల యాజమాన్యాల మధ్య చర్చలు సాగుతున్నట్లు వార్తలు వెలువెడుతున్నాయి. ఈ విలీనానాకి సంబంధించిన స్వాప్ రేషియోపై ఇండియన్ హోటల్స్, జీవీకే రెడ్డి సంస్థలు చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ విలీన ప్రతిపాదన ఓకే అయినా ...తాజ్ జీవీకేను ప్రత్యేక కంపెనీగా లిస్టింగ్ కొనసాగించే వీలున్నట్లు సమాచారం. అయితే జూన్ 30, 2016 నాటికి తాజ్ జీవీకేలో జీవీకే గ్రూప్ 50 శాతం వాటాను, ఇండియన్ హెటల్స్ కంపెనీ 25.52 శాతం వాటాను కలిగి ఉంది. ఈ వార్తలతో తాజ్ జీవీకే హోటల్స్ & రిసార్ట్స్ షేర్ దాదాపు 20 శాతం ర్యాలీ అయింది బీఎస్ఈలో 20 శాతం అప్పర్‌సర్క్యూట్‌ను తాకింది. ఇండియన్ హోటల్స్ షేరు కూడా లాభాల బాటపట్టింది. మరోవైపు ఈ వార్తలపై ఇండియన్ హోటల్స్ ను కంపనీని వివరణ కోరినట్టు బీఎస్ ఈ తెలిపింది. ఇండియన్ హోటల్స్ యాజమాన్యం ఇంకా స్పందించాల్సి ఉంది.


