హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వతంత్ర విద్యుదుత్పత్తి దిగ్గజాల్లో ఒకటైన ఎస్‌ఈఐఎల్ ఎనర్జీ ఇండియా ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కించుకుంది. 2025–26 సంవత్సరానికి గాను ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ సరి్టఫికేషన్ లభించింది. ఉద్యోగానికి అనువైన సంస్థగా 86 శాతం మంది ఉద్యోగులు ఎస్‌ఈఐఎల్‌ని ఎంచుకున్నట్లు కంపెనీ తెలిపింది.
గ్రేట్ ప్లేస్ టు వర్క్ గుర్తింపును పొందడం వరుసగా ఇది రెండోసారని వివరించింది. వ్యక్తిగత జీవితం–ఉద్యోగం మధ్య సమతుల్యత, ఉద్యోగుల ఎదుగుదలకు అవకాశాల కల్పన తదితర అంశాలకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తామని కంపెనీ సీఈవో జనమేజయ మహాపాత్ర తెలిపారు.


