
డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం బజాజ్ ఫిన్‌సర్వ్ తాజాగా బీమా రంగ భాగస్వామ్య సంస్థలను రీబ్రాండింగ్ చేసింది. దీంతో ఇకపై బజాజ్ అలయెంజ్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయెంజ్ లైఫ్ ఇన్సూరెన్స్.. బజాజ్ జనరల్, బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్‌గా సేవలు అందించనున్నాయి. ఈ ఏడాది మొదట్లో రెండు సంస్థలలోనూ భాగస్వామ్య కంపెనీ అలయెంజ్ ఎస్‌ఈకి గల 26 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు బజాజ్ గ్రూప్ ఒప్పందం(ఎస్‌పీఏ) కుదుర్చుకుంది.
ఈ ఒప్పందాన్ని అమలు చేయడంతో వీటిలో బజాజ్ గ్రూప్ వాటా ప్రస్తుతం 74 శాతం నుంచి 100 శాతానికి చేరనుంది. ఎస్‌పీఏకు అన్ని రకాల అనుమతులు లభించడంతో రెండు సంస్థలూ బజాజ్ గ్రూప్‌నకు పూర్తి అనుబంధ సంస్థలుగా అవతరించనున్నాయి. భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా బజాజ్ గ్రూప్ తొలుత వీటిలో కనీసం 6.1 శాతం వాటా కొనుగోలుని పూర్తి చేయవలసి ఉంటుంది. దీంతో అలయెంజ్ ప్రమోటర్ గుర్తింపును కోల్పోవడం ద్వారా ఇన్వెస్టర్‌గా మారనుంది.
ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ!