
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన ప్రీమియం “ఇంపీరియా” ప్రోగ్రామ్‌కు సంబంధించి కొత్త అర్హత ప్రమాణాన్ని ప్రకటించింది. అక్టోబర్ 1, 2025 నుంచి, కస్టమర్లు రూ.1 కోటి “టోటల్ రిలేషన్‌షిప్ వాల్యూ (TRV)” ఆధారంగా కూడా ఈ ప్రోగ్రామ్‌కు అర్హత పొందవచ్చు. ఇది వ్యక్తిగత ఖాతాలకే కాకుండా, కుటుంబ సభ్యులు లేదా బిజినెస్ గ్రూప్‌లతో కలిపి ఉన్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.
ఇంతకు ముందు హెచ్డీఎఫ్సీ ఇంపీరియా ప్రోగ్రామ్‌లో టీఆర్వీ ఆధారంగా అర్హత పొందాలంటే, రూ.1 కోటి విలువను వ్యక్తిగత ఖాతా స్థాయిలో నిర్వహించాల్సి ఉండేది. అంటే, ఒక కస్టమర్‌కి చెందిన సేవింగ్స్, ఎఫ్డీ, పెట్టుబడులు, లోన్లు, డీమాట్, ఇన్సూరెన్స్ ప్రీమియం మొదలైనవి కలిపి రూ.1 కోటి టీఆర్వీ ఉండాలి. తాజా మార్పు ప్రకారం.. గ్రూప్ స్థాయిలో రూ.1 కోటి టీఆర్వీ ఉంటే సరిపోతుంది. కుటుంబ సభ్యులు లేదా బిజినెస్ ఎంటిటీల ఖాతాలు కలిపి ఈ విలువ చేరవచ్చు.
టీఆర్వీ కాకుండా ఇతర అర్హత మార్గాల ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ ఇంపీరియా ప్రోగ్రామ్‌లో చేరాలంటే కరెంట్ ఖాతాలో రూ.15 లక్షల సగటు త్రైమాసిక బ్యాలెన్స్ నిర్వహించాలి. అదే సేవింగ్స్ ఖాతాలో అయితే రూ.10 లక్షల సగటు నెలవారీ బ్యాలెన్స్ ఉండాలి. ఎఫ్డీ, సేవింగ్స్, కరెంట్ ఖాతాలన్నీ కలిపి అయిఏత రూ.30 లక్షల సగటు బ్యాలెన్స్ ఉండాలి. హెచ్డీఎఫ్సీ కార్పొరేట్ ఖాతాల్లో రూ.3 లక్షల పైగా నెలవారీ జీతం జమయ్యేవారికి కూడా ఇంపీరియా ప్రోగ్రామ్ ప్రయోజనాలు లభిస్తాయి.
ఇంపీరియా ప్రోగ్రామ్.. దాని ప్రయోజనాలు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇంపీరియా ప్రోగ్రాం అనేది హై-వ్యాల్యూ కస్టమర్ల కోసం రూపొందించిన ప్రీమియం బ్యాంకింగ్ సేవల ప్యాకేజీ. దీని ముఖ్యమైన ప్రయోజనాలు కస్టమర్‌కు ప్రత్యేకత, ప్రాధాన్యత, ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తాయి.
ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్:
వ్యక్తిగతంగా సేవలు అందించే రిలేషన్‌షిప్ మేనేజర్
పెట్టుబడులు, లోన్లు, ఇన్సూరెన్స్ వంటి అంశాల్లో గైడెన్స్
వెల్త్ అడ్వయిజరీ సేవలు:
ఫైనాన్షియల్ ప్లానింగ్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్
మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా సలహాలు
ఉచిత, తగ్గింపు సేవలు:
చెక్‌బుక్, స్టాప్ పేమెంట్, ఇంటర్-బ్రాంచ్ ట్రాన్స్ఫర్ వంటి సేవలు ఉచితం
మొదటి లాకర్ ఉచితం, రెండవది 50% తగ్గింపు
ప్రాధాన్యత ధరలు:
ఫారెక్స్ ట్రాన్సాక్షన్లు, లోన్లు, ఎఫ్డీలు, ఇతర ఉత్పత్తులపై ప్రత్యేక రేట్లు
ప్రత్యేక ఆఫర్లు, ప్రోమోషన్లు:
హెచ్‌డీఎఫ్సీ భాగస్వామ్య బ్రాండ్స్ వద్ద క్యాష్ బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్లు, రివార్డ్పాయింట్లు, లైఫ్‌స్టైల్ బెనిఫిట్లు