
ఉద్యోగుల భవిష్య నిధి.. ఈపీఎఫ్‌వోకు జూన్‌లో నికరంగా 21.89 లక్షలమంది సభ్యులు కొత్తగా జత కలిశారు. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. వార్షికంగా 13.5 శాతం వృద్ధి నమోదైంది. నెలవారీగా చూస్తే ఈ సంఖ్య 9.15 శాతం బలపడింది. కార్మిక శాఖ వెల్లడించిన ప్రొవిజనల్ గణాంకాలివి. వీటి ప్రకారం 2018 ఏప్రిల్‌లో ఈపీఎఫ్‌వో పేరోల్ గణాంకాల విడుదల ప్రారంభించాక గరిష్టస్థాయిలో సభ్యులు జత కలడం గమనార్హం!
ఉద్యోగ అవకాశాలు పుంజుకోవడం, ఉద్యోగ లబ్దిపై అవగాహన పెరగడానికితోడు ఈపీఎఫ్‌వో ప్రభావవంత కార్యక్రమాలు ఇందుకు దోహదపడినట్లు కార్మిక శాఖ పేర్కొంది. కాగా.. 2025 జూన్‌లో 10.62 లక్షలమంది కొత్త సబ్ర్‌స్కయిబర్లు ఎన్‌రోల్ అయ్యారు. 2025 మేతో పోలిస్తే 12.7 శాతం అధికంకాగా.. వార్షికంగా 3.6 శాతం వృద్ధి ఇది. వీరిలో 18–25 మధ్య వయసు కలిగినవారి సంఖ్య 6.39 లక్షలమంది. అంటే 60 శాతానికిపైగా వాటా వీరిదే.
ఈ గ్రూపులో నికర పేరోల్ జమలు 9.72 లక్షలుగా నమోదైంది. ఇంతక్రితం వైదొలగినవారు సుమారు 16.93 లక్షలమంది 2025 జూన్‌లో ఈపీఎఫ్‌వోకు జత కలిశారు. ఈ కాలంలో 3.02 లక్షలమంది మహిళలు ఈపీఎఫ్‌వో కొత్త సబ్‌స్కయిబర్లుగా చేరారు. 2025 మే నెలతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. నికర పేరోల్ జమల్లో మహిళల సంఖ్య 4.72 లక్షలుగా నమోదైంది. రాష్ట్రాలవారీగా పేరోల్ గణాంకాలు చూస్తే 20 శాతంతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా.. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితరాలు 5 శాతం చొప్పున వాటా ఆక్రమించాయి.
ఇదీ చదవండి: ఉమాంగ్ యాప్‌లో యూఏఎన్.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్