
గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌లో స్థానం
బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా షోడౌన్ (BMSD) 2025 ఆన్‌లైన్ గేమింగ్ పోటీలో టీమ్ ఒరంగుటాన్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. హైదరాబాద్‌లోని లైవ్-స్టూడియో అరేనాలో ఉత్కంఠభరితంగా ఈ పోటీలు నిర్వహించారు. మూడు రోజుల హై-ఇంటెన్సిటీ పోటీ తర్వాత టీమ్ ఒరంగుటాన్ ఛాంపియన్‌గా నిలవడంతోపాటు భారతదేశపు అగ్రశ్రేణి బీజీఎంఐ జట్టుగా నిలిచింది.
రూ.1 కోటి ప్రైజ్ పూల్‌లో ఒరంగుటాన్ అధికభాగం వాటా రూ.30 లక్షలను దక్కించుకుంది. దాంతోపాటు రాబోయే గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌లో స్లాట్‌ను కైవసం చేసుకుంది.
గెలుపొందిన టీమ్‌లు, నగదు బహుమతులు కింది విధంగా ఉన్నాయి.
ఛాంపియన్: టీమ్ ఒరంగుటాన్(రూ.30 లక్షలు)
రెండో స్థానం: K9 ఈస్పోర్ట్స్ (రూ.15 లక్షల నగదు బహుమతి)
మూడో స్థానం: టీమ్ సోల్ (రూ.10 లక్షల నగదు బహుమతి)
అంతర్జాతీయ వేదికపై అడుగు
ఈ టోర్నమెంట్ భారతదేశపు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఆన్‌లైన్ గేమింగ్ పోటీదారుల కోసం అంతర్జాతీయ వేదికకు ద్వారాలు తెరిచింది. ఫైనల్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు ప్రతిష్టాత్మకమైన బీజీఎంఐ ఇంటర్నేషనల్ కప్ (బీఎంఐసీ)కు అర్హత సాధించాయి. ఈ కప్‌లో వారు కొరియా, జపాన్ నుంచి వచ్చిన ఎలైట్ జట్లతో పోటీ పడతారు.
బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా షోడౌన్‌లో భాగంగా మరిన్ని విభాగాల్లో బహుమతులు అందించారు. అవి..
అవార్డు | విజేత | బహుమతి |
---|---|---|
టోర్నమెంట్ MVP | OnePlusK9Njboi | రూ. 2 లక్షలు |
ఫైనల్స్ MVP | M4xSNoWJoD | రూ. 1 లక్ష |
బెస్ట్ క్లచ్ అవార్డు | M4xSNoWJoD | రూ. 50,000 |
బెస్ట్ IGL (ఇన్-గేమ్ లీడర్) | iQOOxOGAARU | రూ. 75,000 |
ఫ్యాన్ ఫేవరెట్ ప్లేయర్ | GxdLJonaThan03 | రూ. 50,000 |
ఈస్పోర్ట్స్ కమ్యూనిటీపై ప్రభావం
సెప్టెంబర్ 18 నుంచి వారాల పాటు సాగిన 16 ఉత్తమ బీజీఎంఐ జట్ల మధ్య జరిగిన పోరుతో ఈ ఫైనల్స్ ముగిశాయి. ఈ సందర్భంగా క్రాఫ్టన్ ఇండియా ఈస్పోర్ట్స్ అసోసియేట్ డైరెక్టర్ కరణ్ పాఠక్ మాట్లాడుతూ..‘బీజీఎంఐ షోడౌన్ భారతదేశ ఈస్పోర్ట్స్ కమ్యూనిటీలో లోతైన ప్రతిభను, అభిరుచిని మరోసారి ప్రదర్శించింది. బీఎంఐసీ వండి అంతర్జాతీయ పోటీల్లో గుర్తింపు పొందేందుకు పోటీదారులు సిద్ధంగా ఉన్నారు. వారి ప్రదర్శనలు ఇండియన్ ఈస్పోర్ట్స్ సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రతిబింబిస్తాయి’ అన్నారు.
ఇదీ చదవండి: 3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు! ప్రభుత్వం నిర్ణయం..