
బీమా రంగ దిగ్గజం ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తమ ఫ్లాగ్‌షిప్ ఆరోగ్య బీమా పథకం హెల్త్ ఆల్ఫాను ఆవిష్కరించింది. జీవన విధానాలు, ఆరోగ్య సంరక్షణ అవసరాలకు తగ్గట్లు 50 పైగా కవరేజీ ఆప్షన్లతో ఇది లభిస్తుంది. సమ్ ఇన్సూర్డ్ రూ. 5 లక్షల నుంచి ఉంటుంది. దీర్ఘకాలికంగా 5 ఏళ్ల వరకు పాలసీ వ్యవధిని ఎంచుకోవచ్చు.
క్లెయిమ్స్ చేయకపోతే ఏటా పది రెట్లు క్యుములేటివ్ బోనస్, జిమ్.. స్పోర్ట్స్ గాయాలకు కవరేజీ, కోట్ జనరేట్ చేసిన అయిదు రోజుల్లోగా కొత్త పాలసీని కొనుగోలు చేస్తే 5 శాతం వెల్కం డిస్కౌంటు, డే కేర్ ట్రీట్‌మెంట్ మొదలైన ఫీచర్లు ఈ పాలసీలో ఉన్నాయి. జీఎస్‌టీ సంస్కరణల తర్వాత పరిశ్రమలో తొలిసారిగా ప్రవేశపెట్టిన పథకం ఇదని సంస్థ డిప్యూటీ సీఈవో మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ తెలిపారు.
ప్లాన్ పూర్తి ఫీచర్లు
10 రెట్ల వరకు క్యూమ్యులేటివ్ బోనస్: ఇది ఒక అదనపు కవర్. పాలసీ కింద ఏదైనా క్లెయిమ్ చేయకపోతే ప్రతి సంవత్సరం గరిష్ఠంగా 10 రెట్లు క్యూమ్యులేటివ్ బోనస్ అందిస్తుంది.
అన్‌లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్: ఈ పాలసీ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ పరిమితి లేకుండా ఉంటుంది. పాలసీ నిబంధనలు, షరతుల ప్రకారం, ఎంత మొత్తం క్లెయిమ్ అయినా చెల్లిస్తారు.
ఎండ్లెస్ సమ్ ఇన్ష్యూర్డ్: ఒకే క్లెయిమ్‌లో బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ దాటి ఆసుపత్రి ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ ప్రయోజనాన్ని పాలసీ జీవితంలో ఒక్కసారి మాత్రమే వినియోగించవచ్చు.
జిమ్ & స్పోర్ట్స్ ఇంజురీ కవర్: ఇది ఇండస్ట్రీలోనే మొదటిసారిగా అందిస్తున్న ప్రత్యేక అదనపు కవర్. హాబీ స్పోర్ట్స్ లేదా డైలీ ఫిట్‌నెస్ కార్యకలాపాలలో గాయపడిన సందర్భాలలో ఓపీడీ ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో స్పెషలిస్ట్ కన్సల్టేషన్‌లు, డయాగ్నస్టిక్ పరీక్షలు, ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్లు, ఫిజికల్ థెరపీ కవర్ అవుతాయి.
ప్లాన్ అహెడ్: ఈ ప్రత్యేక అదనపు ప్రయోజనం వల్ల పాలసీదారు సంపాదించిన వెయిటింగ్ పీరియడ్ కంటిన్యూయిటీని కొత్తగా పెళ్లి అయిన జీవిత భాగస్వామికి (గరిష్ఠంగా 35 ఏళ్ల వయస్సు వరకు), నవజాత శిశువులకు (గరిష్ఠంగా 2 మంది పిల్లలు) వర్తింపజేయవచ్చు. అయితే వారు వివాహం లేదా పుట్టిన తేదీ నుండి 120 రోజులలోపు పాలసీలో చేరాల్సి ఉంటుంది.
వెల్కమ్ డిస్కౌంట్: కోటేషన్ రూపొందించిన 5 రోజులలోపుగా పాలసీ కొనుగోలు చేసినట్లయితే 5శాం ప్రత్యేక "వెల్కమ్ డిస్కౌంట్" ఇస్తారు.