ఓయో కంపెనీ పేరు మారింది.. ఐపీఓ ముంగిట కీలక మార్పు | OYO Parent Oravel Stays Renamed as ‘Prism Life’ Ahead of IPO | Sakshi
Sakshi News home page

ఓయో కంపెనీ పేరు మారింది.. ఐపీఓ ముంగిట కీలక మార్పు

Sep 8 2025 4:46 PM | Updated on Sep 8 2025 7:45 PM

OYO Rebrands Parent Company to Prism Ahead of Public Listing

గ్లోబల్ ట్రావెల్ టెక్ ప్లాట్ ఫామ్ ఓయో (OYO) కంపెనీ పేరు మారింది. ఐపీఓ ముంగిట ఓయో మాతృసంస్థ ఒరావెల్ స్టేస్ తన పేరును ‘ప్రిజం’గా మార్చుకుంది. ఇది దాని అన్ని వ్యాపారాలకు గొడుగు సంస్థగా పనిచేస్తుంది. తమ ప్లాట్ ఫామ్‌కు సంబంధించిన వివిధ బ్రాండ్లను ఏకతాటిపైకి తీసుకురానుంది. అయితే ఒక బ్రాండ్‌గా ఓయో పేరు మాత్రం కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది.

ఒరావెల్ స్టేస్ ఇకపై ‘ప్రిజం లైఫ్’ సంక్షిప్తంగా ‘ప్రిజం’గా  కొత్త కార్పొరేట్ గుర్తింపును కొనసాగిస్తుందని ఓయో షేర్ హోల్డర్లకు పంపిన లేఖలో బోర్డు చైర్మన్, వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు."ప్రిజం మన విభిన్న వ్యాపారాలన్నింటికీ గొడుగులా పనిచేస్తుంది, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, మనం ఎవరో స్పష్టంగా తెలియజేయడానికి మనకు సహాయపడుతుంది. ఇది మన వేర్వేరు బ్రాండ్లను విడిపోకుండా కలుపుతుంది" అని అగర్వాల్ లేఖలో పేర్కొన్నారు.

కొత్త పేరు ఇలా వచ్చింది..
మాతృ సంస్థ పేరు మార్చాలని నిర్ణయించిన యాజమాన్యం కొత్త పేరు సూచించాలని ప్రపంచస్థాయిలో ఓ పోటీ పెట్టింది. ఇందులో 6,000 లకు పైగా వచ్చిన సూచనల్లో నుంచి ప్రిజం పేరును ఎంపిక చేసింది. అగర్వాల్ 2012లో స్థాపించిన ఓయో 35 దేశాల్లో 100 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ఓయో, మోటెల్ 6, టౌన్ హౌస్, సండే, ప్యాలెట్ వంటి బ్రాండ్ల కింద హోటళ్లను ఈ గ్రూప్ పోర్ట్ ఫోలియో విస్తరించింది.

వెకేషన్ హోమ్స్ విభాగంలో బెల్విల్లా, డాన్ సెంటర్, చెక్ మైగెస్ట్, స్టూడియో ప్రెస్టీజ్ వంటి వివిధ బ్రాండ్లను నిర్వహిస్తోంది. అమెరికాలోని జీ6 హాస్పిటాలిటీ ద్వారా దక్కించుకున్న స్టూడియో 6 ఈ ఎక్స్టెండెడ్ స్టే కేటగిరీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. అదనంగా, పోర్ట్ ఫోలియోలో వర్క్ స్పేస్ లు, సెలబ్రేషన్ స్పేస్ లు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భాగస్వామ్య సాధనాలు, డేటా సైన్స్ ప్లాట్‌ఫామ్‌లతో సహా ఆతిథ్య సాంకేతిక పరిష్కారాలను కూడా ఈ గ్రూప్ అందిస్తుంది.

ఇదీ చదవండి: ఖరీదైన అపార్ట్‌మెంట్‌లు.. బాలీవుడ్‌ నటులకు భారీ లాభాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement