ఫ్రీగా ఓయో రూమ్స్‌లో బస | OYO Offers Free Stays from March 13 to 18 | Sakshi
Sakshi News home page

ఫ్రీగా ఓయో రూమ్స్‌లో బస

Mar 14 2025 2:35 PM | Updated on Mar 14 2025 2:52 PM

OYO Offers Free Stays from March 13 to 18

భారతదేశ ప్రముఖ ఆతిథ్య బ్రాండ్లలో ఒకటైన ఓయో రూమ్స్‌ వినియోగదారులకు హోలీ సందర్భంగా ఉచిత ఆఫర్‌ను ప్రకటించింది. ఇండియా క్రికెట్‌ టీమ్‌ ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించండం, తర్వాత హోలీ పండుగ నేపథ్యంలో మార్చి 13 నుంచి 18 వరకు ఓయో దేశవ్యాప్తంగా 1,000 ప్రీమియం కంపెనీ సర్వీస్ హోటళ్లలో రోజూ 2,000 ఉచిత స్టేలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు సంస్థ వ్యవస్థాపకులు రితేష్‌ అగర్వాల్‌ ఎక్స్‌ వేదికగా వివరాలు వెల్లడించారు.

వినియోగదారులు ఈ పరిమిత ఓయో ప్రీమియం ఆతిథ్యాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా ఆస్వాధించవచ్చని రితేష్‌ తెలిపారు. ఓయో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసేటప్పుడు కూపన్ కోడ్ ‘CHAMPIONS’ అని ఎంటర్ చేయాలని పేర్కొన్నారు. దాంతో కస్టమర్లు తమ కాంప్లిమెంటరీ స్టేను రెడీమ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ ఆఫర్ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్(ముందుగా బుక్‌ చేసుకున్న వారికే వర్తించేలా) ప్రాతిపదికన పని చేస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?

భారత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని అందరూ అస్వాదిస్తున్నారని రితేశ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో హోలీ తోడవడం వినియోగదారులకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. ఈ తరుణంలో కంపెనీ కస్టమర్లకు ఉచిత ఆఫర్‌ ప్రకటించిందని చెప్పారు. ఈ వారాంతంలో మధురమైన జ్ఞాపకాలను సొంతం చేసేందుకు కంపెనీ తోడైందని తెలిపారు. ప్రయాణాలు చేయడం, ప్రియమైనవారిని కలవడం కంటే సంతోషకరమైన క్షణాలు ఏముంటాయన్నారు. అందుకోసం ఓయో రూమ్స్‌ ‘టౌన్ హౌస్, కలెక్షన్ ఓ’తో సహా 1000కి పైగా ఓయో కంపెనీ సర్వీస్ హోటళ్లలో మార్చి 13-18 వరకు ప్రతిరోజూ ఉచిత బసలను అందిస్తున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement