
కొన్ని రైళ్లు పగలు కంటే రాత్రిపూటే వేగంగా ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది కదా. నిత్యం రైలు ప్రయాణం చేస్తున్నవారు ఇది గమనించే ఉంటారు. ఇది ఒక మిస్టరీగా అనిపించినప్పటికీ దీని వెనుక కారణాలు లేకపోలేదు. కొన్ని ఆసక్తికరమైన, ఆచరణాత్మక కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాత్రిపూట రైలు వేగం పెరగడానికి దోహదపడే కీలక అంశాలను తెలియజేస్తున్నారు.
ట్రాక్ రద్దీ తగ్గుదల
పగటిపూట రైల్వే ట్రాక్‌లు రద్దీగా ఉంటాయి. ప్యాసింజర్ రైళ్లు, సరుకు రవాణా రైళ్లు, ప్రధాన గేట్ల వద్ద పగలు ప్రజల సంచారం వంటి అంశాలతో రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతుంటాయి. పగలు ఇతర రైళ్ల డైవర్షన్ కోసం కొన్ని రైళ్లను గంటల తరబడి నిలిపేస్తుంటారు. రాత్రిపూట ఈ ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. దాంతో రైళ్లు వేగంగా నడిచేందుకు వీలుంటుంది.
తక్కువ స్టాప్‌లు
పగటిపూట ప్యాసింజర్ రైళ్లతో పోలిస్తే రాత్రిపూట రైళ్లు, ముఖ్యంగా సుదూర, సరుకు రవాణా సేవలు అందించే రైళ్లకు తక్కువ స్టాపులను షెడ్యూల్ చేస్తారు. దాంతో అంతరాయాలు లేకుండా రైళ్లు వాటి వేగాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.
డ్రైవర్ విజిబిలిటీ
నైట్ డ్రైవింగ్‌లో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, పగలు రద్దీగా ఉండే స్టేషన్లు లేదా రద్దీగా ఉండే క్రాసింగ్‌లపై లోకోపైలట్లు పెద్దగా దృష్టి కేంద్రీకరించే అవసరం ఉండదు. దాంతో పూర్తిగా డ్రైవింగ్, ట్రాక్‌పైనే దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. హై పవర్డ్ హెడ్ లైట్స్, ఆధునిక సిగ్నలింగ్ సిస్టమ్స్ వంటి అధునాతన సాంకేతికత సురక్షితమైన, సమర్థవంతమైన కార్యకలాపాలను నిర్ధారిస్తుంది.
ఇదీ చదవండి: జియోస్టార్ యూట్యూబ్ కంటెంట్ తొలగింపు
షెడ్యుల్‌లో మార్పులు
రైల్వే నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడానికి రాత్రిపూట రైళ్ల షెడ్యుల్‌ను వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తారు. వేగవంతమైన ప్రయాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ప్రాంతాల మధ్య వస్తువులను రవాణా చేసే సరుకు రవాణా రైళ్ల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment