భారత్‌ని సందర్శించిన జర్మన్ వ్లాగర్ అలెక్స్ వెల్డర్ ఇప్పటివరకు తాను చూసిన వాటిలో ఇదే అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం అంటూ దాని గురించి వెల్లడించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడమే కాదు..నెట్టింట ఆ ప్రదేశం హాట్‌టాపిక్‌గా మారింది.
జర్మన్ వ్లాగర్ అలెక్స్ భారతదేశంలో తాను చూసిన అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం ఇదేనని క్యాప్షన్ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియోలో తాను దక్షిణ గోవాని సందర్శించిన అనుభవాన్ని పంచుకున్నాడు. "బహుశా భారతదేశంలో నేను చూసిన వాటిల్లో ఇదే అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం అయ్యి ఉండొచ్చు.
కచ్చితంగా ఈ గోవా సూపర్ పార్టీ హాట్ స్పాట్ అవుతుంది. ఇక్కడకు చాలామంది పర్యాటకులు వస్తుంటారు. అయినా ఇక్కడ చెత్త ఉంటుదని అంచనవేయలేంద. ఈ దక్షిణ గోవా చుట్టూ తిరxగా ఎక్కడా.. చిన్న చెత్త ముక్క దొరకలేదు అంటూ ఆశ్చర్యపోయాడు. తాను అక్కడ ముగ్గురు స్థానికులను చూశానని, వాళ్లు ఆకాశం వైపు చూసి నవ్వుతూ ఉండటం చూశానని అన్నాడు.
ఈ ప్రదేశం అందానికి నిజంగా మంత్ర ముగ్దుడుని అయిపోయా..ఇది నిజంగా యూరప్‌లా అనిపిస్తోంది. కచ్చితంగా దీన్ని చూడాగానే ఎవ్వరైనా..ఉష్ణమండల దేశమైన భారత్ అని అనుకోరు. ఇక్కడ ఎక్కడ మీకు ఒక్క చెత్త డబ్బ కనిపించదు. ఈ ప్రదేశానని చూసి కచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఇది నిజంగా అందంగా ఉంది అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు అలెక్స్. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆ ప్రదేశం ఎప్పటికీ అలానే ఉండాలి అని ఆశిస్తున్నాం, కోరుకుంటుంన్నాం అంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: అతిపెద్ద సాలీడు గూడు..ఏకంగా లక్షకు పైగా సాలెపురుగుల నైపుణ్యం..!)


