అతిపెద్ద సాలీడు గూడు..ఏకంగా లక్షకు పైగా సాలెపురుగుల నైపుణ్యం..! | Scientists Discover Worlds Largest Spiderweb Housing | Sakshi
Sakshi News home page

అతిపెద్ద సాలీడు గూడు..ఏకంగా లక్షకు పైగా సాలెపురుగుల నైపుణ్యం..!

Nov 8 2025 12:51 PM | Updated on Nov 8 2025 12:56 PM

Scientists Discover Worlds Largest Spiderweb Housing

ప్రపంచంలోనే అతిపెద్ద సాలీగూడుని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అల్బేనియన్‌ గ్రీకు సరిహద్దులోని చీకటి గుహలో ఈ బారీ సాలీడు గూడును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గూడులో మొత్తం లక్షలకు పైగా సాలెపురుగులు నివాసం ఉన్నాయని, అందులో 69 వేలు దేశీ సాలెపురుగులు కాగా, మరో 42 వేలు మరోరకం జాతి సాలెపురుగులు ఉన్నట్లు వెల్లడించారు. 

ఈ భారీ గూడు సుమారుగా 1,140 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అయితే సూర్యరశ్మిలేని అధికస్థాయి విషపూరిత హైడ్రోజన్‌ సల్ఫర్‌ వాయువు ఉన్న గుహలో ఈ సాలెపురుగులు ఎలా మనుగడ సాగించగలుగుతున్నాయనేది శాస్త్రవేత్తలను అయోమయంలో పడేసింది. ఈ సల్ఫర్‌ గుహ ఎంట్రెన్స్‌లో కటిక చీకటిలో ఈ భారీ సాలీడు గూడు ఉండటం విశేషం. 

ఈ భారీ గూడులో  ఆధిపత్య సాలీడు జాతులు కలిసి జీవించడం అనేది అత్యంత విచిత్రమని, ఇదొక ప్రత్యేకమైన కేసుగా పేర్కొన్నారు. ఇక గుహలోపలి వరకు ఉన్న గూడులోని సాలీడ్లు సల్ఫర్ తినే సూక్ష్మజీవులను ఆహారంగా తీసుకునే చిన్న మిడ్జ్‌లను ఈ సాలీడు పురుగులు తింటాయని పరిశోధకులు గుర్తించారు. 

ఇక గుహ బయట వైపు ఉన్న గూడులోని సాలీడు పురుగులు వీటికి అత్యంత భిన్నంగా ఉన్నాయని తెలిపారు. జన్యుపరంగా కూడా ఇవి చాలా వ్యత్యాసంగా ఉన్నాయన్నారు. గుహలోపల ఉండే మురికికి అనుగుణంగా అక్కడ ఉండే సాలీడులు జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతుంది. 

 

(చదవండి: pooja kaul: ఖరము పాలతో కాస్మెటిక్‌..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement