ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు ఇవన్నీ పెద్దవిగా అనిపిస్తున్నాయా? అయితే రెడీగా ఉండండి! ఇప్పుడు ప్రపంచంలోనే అతి చిన్న కంప్యూటర్ వచ్చేసింది. అది కూడా ఒక బియ్యపు గింజ కంటే చిన్నది. అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని రూపొందించారు. కేవలం 0.3 మిల్లీమీటర్లు పరిమాణంలో ఉంటుంది. కాని, ఇది చేసే పనులు తెలిస్తే, పెద్ద పెద్ద కంప్యూటర్లు కూడా షాక్ అవుతున్నాయి.
అంతేకాదు, ఈ సూక్ష్మ యంత్రాన్ని శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే, ఇది క్యాన్సర్ కణాలను గమనిస్తుంది. క్యాన్సర్ కణితి లోపలి ఉష్ణోగ్రతను కొలుస్తుంది, ఇంకా డాక్టర్లకు రియల్‌టైమ్ డేటా పంపిస్తుంది. అంటే ఇది డాక్టర్ జేబులో దాగి ఉన్న గూఢచారిలా పనిచేస్తుంది.
ప్రస్తుతం ఇంకా పరిశోధన దశలో ఉన్న ఈ కంప్యూటర్, భవిష్యత్తులో పర్యావరణ పరిశీలన, భద్రతా సెన్సర్లు, ఇంకా మన ఊహలకు మించి ఉండే స్మార్ట్ పరికరాల్లోనూ తన మాయాజాలాన్ని చూపబోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
(చదవండి: సూట్‌కేస్ ఓపెన్ చేస్తే.. లైట్ ఆన్!)


