సూట్‌కేస్‌లో బట్టలు కాదు, ఇప్పుడు బల్బులు వెలిగించే పవర్‌ను సర్దేయవచ్చు! అవును, చిన్న సూట్‌కేస్‌లా కనిపించే ఇది, నిజానికి ఒక విద్యుత్ ఉత్పత్తి యంత్రం. సాధారణంగా కరెంట్ జనరేటర్స్ మాదిరి వైర్లు, బల్బులు, ట్రాన్స్‌ఫార్మర్లు, జేబుకు చిల్లులు పడే బిల్లులు మాదిరి కాకుండా, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తూ, కొత్తగా జర్మనీ శాస్త్రవేత్తలు ఈ సూట్‌కేస్ సైజ్ టర్బైన్‌ను డిజైన్ చేశారు.
ఇది నది లేదా వాగు దగ్గర పెట్టేస్తే చాలు, నీరు ప్రవహించగానే, కైనెటిక్ ఎనర్జీని ఉపయోగించుకొని, విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్యామ్ లేదు, డ్యామేజ్ లేదు, కేవలం నీటి ప్రవాహమే దీని ఇంధనం. పైగా ఇది లైట్ వెయిట్. సెట్ చేయడం కూడా చాలా సింపుల్. ప్రవహించే నీటి పక్కన, సూట్‌కేస్ ఓపెన్ చేస్తే చాలు, రెండు గంటల్లో ‘లైట్ ఆన్!’ అవుతుంది.
నీరు తక్కువగా ఉన్నా కూడా ఇది పనిచేస్తుంది. ఒక యూనిట్‌తో పది ఇళ్లు వెలుగుతాయి, రెండు యూనిట్లు పెట్టేస్తే ఊరంతా డిస్కో లైట్స్ ఆన్ చేయొచ్చు. ఇప్పటికే ఆసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికాలో దీన్ని టెస్ట్ చేశారు. ఫలితం? సూపర్ హిట్! త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తే, గ్రామాలు, పల్లెలు అన్నీ ‘సూట్‌కేస్ పవర్ స్టేషన్’లుగా మారిపోతాయి.
(చదవండి: నవ్విస్తూ కొనేలా చేశాడు!'యాడ్ గురు'..)


