‘అన్న షర్టేస్తే మాస్!’ మాత్రమే కాదు, ఇప్పుడు అన్న ఈ షర్టేస్తే సేఫ్ కూడా! అవును, జర్మన్ పరిశోధకులు సృష్టించిన ఈ స్మార్ట్ ఫ్యాబ్రిక్‌తో తయారైన షర్ట్ చూడ్డానికి సాధారణ షర్ట్‌లాగే ఉంటుంది. కాని, ఇందులో దాగి ఉన్న మ్యాజిక్ మాత్రం అదిరిపోతుంది! ఈ ఫ్యాబ్రిక్‌లోని మాలిక్యూల్స్‌ను వారు ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ఫ్యాబ్రిక్ చూడ్డానికి మృదువుగా, ఫ్లెక్సిబుల్‌గానే ఉంటుంది. కాని, దానిపై ఒక్కసారిగా బలమైన దెబ్బ పడితే, వెంటనే గట్టి కవచంలా మారిపోతుంది. అచ్చం, క్షణాల్లో మారే సాఫ్ట్ షర్ట్ బుల్లెట్ ప్రూఫ్‌లాగా. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ల మాదిరి రక్షణ ఇస్తూనే, చాలా తేలికగా ఉంటుంది, శ్వాస తీసుకోవడానికీ సౌకర్యంగా ఉంటుంది.
కన్‌స్ట్రక్షన్ సైట్లలో ప్రమాదాలు, క్రీడల్లో గాయాలు, వాహన ప్రమాదాలు వంటి ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్న వారికి ఉపయోగపడేలా దీనిని తయారు చేశారట శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో ఈ షర్ట్ ఒక ఫ్యాషన్ మాత్రమే కాదు, సేఫ్టీ వేర్ కూడా!
(చదవండి: Railway TTE of Rs 50 bribery charge: 44 ఏళ్ల నాటి లంచం కేసు..! చనిపోయినే కొన్నేళ్లకు క్లీన్ చిట్)


