న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత పేరుప్రఖ్యాతలు పొందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, దివంగత జయంత్ నర్లీకర్‌ను కేంద్ర ప్రభుత్వం శనివారం ‘విజ్ఞానరత్న పురస్కార్’తో గౌరవించింది. అంతర్జాతీయంగా ప్రాచుర్యంపొందిన విశ్వ ఆవిర్భావ ‘బిగ్‌బ్యాంగ్’ సిద్ధాంతంతో విబేధించి గతంలోనే ఈయన వార్తల్లోకెక్కారు. బ్రిటిష్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఫ్రెడ్ హోలేతో కలిసి ఈయన కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
విశ్వం అనేది మొదట్నుంచీ ఉందని అది ఎప్పటికప్పుడ కొత్త పదార్థాన్ని సృష్టించుకుంటూ విస్తరిస్తోందని నర్లీకర్ ప్రతిపాదించారు. 86 ఏళ్ల వయసులో మే 20వ తేదీన కన్నుమూయడం తెల్సిందే. సేవారంగంలో చేసిన విశేష కృషికి పద్మ అవార్డ్‌లు ఇచ్చినట్లే శాస్త్రసాంకేతిక రంగంలో దేశంలో అత్యున్నత అవార్డ్‌గా గత ఏడాది నుంచి విజ్ఞానరత్న పురస్కార్‌ను ప్రకటిస్తుంటడం తెల్సిందే. awards.gov.in వెబ్‌సైట్‌లో పలు అవార్డ్‌ల విజేత వివరాలను కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఎనిమిది మందికి ‘విజ్ఞాన్ శ్రీ’, 14 మంది విజ్ఞాన్ యువ, ఒకరికి విజ్ఞాన్ టీమ్ అవార్డ్‌ను కేంద్రం ప్రకటించింది.


