గతంతో పోలిస్తే సినిమాలు చేయడం తగ్గించేసిన అనసూయ.. గతేడాది పుష్ప 2, రజాకర్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ ఏడాది రిలీజైన వాటిలో 'అరి' అనే మూవీలో లీడ్ రోల్ చేయగా 'హరిహర వీరమల్లు'లో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ప్రస్తుతానికైతే అనసూయ కొత్త చిత్రాల్లో నటించట్లేదు. అలాంటిది ఈమె చేసిన తమిళ చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు రిలీజైంది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. బడా నిర్మాత భార్య హీరోయిన్)
నాలుగైదేళ్ల క్రితం తెలుగులో వరస సినిమాలు చేసిన అనసూయ.. అదే టైంలో తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాంటి వాటిలో 'ఊల్ఫ్' ఒకటి. ప్రభుదేవా హీరో. అనసూయతో పాటు లక్ష‍్మీ రాయ్ హీరోయిన్‌గా చేసింది. వినూ వెంకటేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ని 2023 ఆగస్టులో రిలీజ్ చేశారు. తర్వాత ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ కూడా లేదు. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం నుంచి 'సాసా' అంటూ సాగే రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.
ఇందులో ప్రభుదేవా సరసన అనసూయ, లక్ష‍్మీ రాయ్, మరో నటి గ్లామరస్‌గా కనిపించారు. పేరుకే తమిళ సినిమా అయినప్పటికీ 'ఊల్ఫ్'ని తెలుగు, కన్నడ, హిందీలోనూ రిలీజ్ చేస్తామని టీజర్ రిలీజ్ టైంలో ప్రకటించారు. ఇప్పుడు వీడియో సాంగ్ రిలీజ్ చేశారు కాబట్టి త్వరలో ఏమైనా మూవీని థియేటర్లలోకి తీసుకొస్తారేమో చూడాలి? ఏదేమైనా అనసూయ ఇలాంటి రొమాంటిక్ పాటలో కనిపించడం తెలుగు ప్రేక్షకులకు చిన్నపాటి షాకే అని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: కొత్తింట్లోకి బిగ్ బాస్ ఫేమ్ కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్)


