ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నింటిని మాత్రం సర్‌ప్రైజ్ స్ట్రీమింగ్ అనేలా అప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు. అలా ఓ హిందీ కామెడీ థ్రిల్లర్ రిలీజ్ గురించి ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది. ప్రజల సొమ్ము దొచుకునే కొందరిపై ఓ మహిళ పాములా పగబడితే అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు. ఇంతకీ ఇది ఏ ఓటీటీలో ఎప్పుడు రానుంది?
(ఇదీ చదవండి: దుల్కర్ సల్మాన్ 'కాంత' ట్రైలర్ రిలీజ్)
2004లో వచ్చిన ఉదయ్ కిరణ్ 'లవ్ టుడే' సినిమాతో హీరోయిన్ అయిన దివ్య ఖోస్లా.. తర్వాత ఏడాదే బాలీవుడ్ బడా నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌ని పెళ్లి చేసుకుంది. నటన పక్కనబెట్టేసింది. 2016 నుంచి నటి, దర్శకురాలిగా సినిమాలు చేస్తున్న ఈమె.. ఇప్పుడు 'ఏక్ చతుర్ నార్' అనే సినిమాతో వచ్చింది. డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబరు 12న థియేటర్లలోకి రాగా.. శుక్రవారం(నవంబరు 07) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.
ఏక్ చతుర్ నార్ విషయానికొస్తే.. లక్నోలోని ఓ మురికివాడలో మమత (దివ్య ఖోస్లా).. కొడుకు, అత్తతో కలిసి జీవిస్తుంటుంది. మెట్రో స్టేషన్‌లో ఉద్యోగం చేస్తుంటుంది. ఓ రోజు మమత పనిచేస్తున్న చోట పెద్ద ఫైనాన్షియర్ అభిషేక్ వర్మ (నీల్ నితిన్ ముఖేష్) ఫోన్ దొంగతనానికి గురవుతుంది. ఆ ఫోన్‌ని పట్టుకోవడానికి వెళ్లిన మమత ఏం చేసింది? అసలు ఫైనాన్షియర్‌కి మమతకు మధ్య గొడవేంటి? ఆ ఫోన్‌లో ఏముంది? దీన్ని అడ్డం పెట్టుకుని మమత ఏమేం పనులు చేసిందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: కొత్తింట్లోకి బిగ్ బాస్ ఫేమ్ కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్)
Ek Chatur Naar, joh hai tez tarrar jaise chaaku ki dhaar 👀 Jeetega is khel mein kaun? 😏
Watch Ek Chatur Naar, out 7 November, on Netflix.#EkChaturNaarOnNetflix pic.twitter.com/IwpE0kUXNN— Netflix India (@NetflixIndia) November 6, 2025


