జీఎస్‌టీ ఎఫెక్ట్‌ : 2 సెకన్లకు ఒక కారు, సెకనుకు 2 టూవీలర్స్‌ | GST cut-fueled festive fever saw one car sold every two seconds | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ ఎఫెక్ట్‌ : 2 సెకన్లకు ఒక కారు, సెకనుకు 2 టూవీలర్స్‌

Nov 8 2025 10:58 AM | Updated on Nov 8 2025 11:32 AM

GST cut-fueled festive fever saw one car sold every two seconds

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ-GST) తగ్గింపు పుణ్యమాని ఆటోమొబైల్‌ కంపెనీలు పండగ చేసుకున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం  చేపట్టిన జీఎస్టీ కోతతో పండుగ వాతావరణం నెలకొని ప్రతి రెండు సెకన్లకు ఒక కారు అమ్ముడైంది.  ఈ ఫెస్టివ్‌ సీజన్‌ ఆటోమోటివ్ రంగానికి బ్లాక్‌బస్టర్ సీజన్‌గా మారింది.  రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. నవరాత్రి నుండి దీపావళి సమయంలో ప్రతి 2 సెకన్లకు ఒక కారును,  ప్రతి సెకనుకు దాదాపు 3 ద్విచక్ర వాహనాలు సేల్‌ అయ్యాయి అంటే డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం  చేసుకోవచ్చు.

ఫెస్టివ్‌ సీజన్‌లో దాదాపు 42 రోజుల కాలంలో దాదాపు 767,000 ప్యాసింజర్ వాహనాలు (కార్లు, స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు , వ్యాన్లు) అమ్ముడయ్యాయి. అలాగే  40.5 లక్షల ద్విచక్ర వాహనాలు (మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, మోపెడ్‌లు) అమ్ముడ య్యాయి. అంటే  రోజుకు సగటున సగటున రోజుకు 18,261 ప్యాసింజర్‌  వెహికల్స్‌ (PV),   96,500 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి.

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA)   అందించిన డేటా ప్రకారం, PV విభాగం 23శాతం వృద్ధిని నమోదు చేయగా, ద్విచక్ర వాహన విభాగం గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం పండుగ కాలంలో 22శాతం  వృద్ధిని నమోదు చేసింది. పట్టణ మార్కెట్‌తో పోలిస్తే గ్రామీణ మార్కెట్లలో రిటైల్ అమ్మకాల వృద్ధి PVకి 3 రెట్లు , ద్విచక్ర వాహనానాల ‌ 2 రెట్లు పెరిగింది. 

(మాలీలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం)

ఈ పెరుగుదల ఆదాయాలు కూడా రికార్డు స్థాయికి  చేరాయి.తాజా అంచనాల ప్రకారం  PV విభాగంలో రూ. 76,700-84,400 కోట్ల టర్నోవర్‌ను  ద్విచక్ర వాహన విభాగం రూ. 36,500-40,500 కోట్ల టర్నోవర్‌ను సాధించింది.  ఇది FADA అంచనా ప్రకారం కారుకు రూ. 10-11 లక్షలు మరియు ద్విచక్ర వాహనం ధర రూ. 90,000-1 లక్ష.

పండుగ డిమాండ్‌, జీఎస్‌టీ తగ్గింపు కలయిక ఆటోమోటివ్ పరిశ్రమలో ఎన్నడూ లేనంత డిమాండ్‌ చూసిందని నిపుణులు పేర్కొంటున్నారు. వినియోగదారులు షోరూమ్‌లకు తరలిరావడంతో, దేశవ్యాప్తంగా డీలర్లు తమ డీలర్‌షిప్‌లను వారి సాధారణ వ్యాపార సమయాలకు మించి తెరిచి ఉంచారు. అటు  సమయానికి వాహనాలను డెలివరీ చేయడానికి డీలర్లు ఇబ్బందులు పడుతున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement