పశ్చిమ ఆఫ్రికా దేశం ఐదుగురు భారతీయుల కిడ్నాప్ వార్త కలకలం రేపింది. ఈ విషయాన్ని భద్రతా వర్గాలు శుక్రవారం ధృవీకరించాయి. ఒక పక్క అశాంతి, జిహాదీ హింసతో అల్లాడి పోతుండగా మరోపక్క కోబ్రీ సమీపంలో ఉగ్రవాదుల చేతిలో భారతీయుల కిడ్నాప్ మరింత ఆందోళన రేపింది.
పశ్చిమ మాలిలోని కోబ్రీ సమీపంలో గురువారం కార్మికులను ముష్కరులు కిడ్నాప్ చేశారని, వారు విద్యుదీకరణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న కంపెనీలో పనిచేస్తున్నారని భద్రతా వర్గాలు AFPకి తెలిపాయి. మరోవైపు బాధితులు పనిచేస్తున్న కంపెనీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ముందుజాగ్రత్త చర్యగా మిగిలిన వారిని రాజధాని బమాకోకు సురక్షితంగా తరలించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తామే ఈ కిడ్నాప్ చేసినట్టు ఇప్పటివరకు ఏ గ్రూపు ప్రకటించలేదు.
2012 నుండి తిరుగుబాట్లు, ఘర్షణలతో అట్టుడుడుతున్న దేశంలో విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్‌లు సర్వసాధారణంగా మారిపోయాయి. అల్‌ఖైదాదీ సంబంధిత గ్రూప్ ఫర్ ది సపోర్ట్ ఆఫ్ ఇస్లాం అండ్ ముస్లింస్ (JNIM) జిహాదీలు సెప్టెంబర్‌లో బమాకో సమీపంలో ఇద్దరు ఎమిరాటీ జాతీయులను మరియు ఒక ఇరానియన్‌ను కిడ్నాప్ చేశారు.50 మిలియన్ల డాలర్ల చెల్లింపు తరువాత వారిని గత వారం విడుదల చేశారు.


