అమెరికా ప్రభుత్వం ఆ దేశంలోని అక్రమ వలసదారుల కోసం క్రేజీ డీల్ ప్రకటించింది. ఆ దేశంలో ఉన్న అక్రమ వలసదారులు దేశాన్ని వదిలి వెళితే వారికి మూడు వేల డాలర్లు అంటే అక్షరాల రూ. 2.68 లక్షలు ఇస్తానని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఈ ఏడాది చివరి వరకే ఉంటుందని కండీషన్ విధించింది.
ట్రంప్ ఈ పేరు వింటే చాలు యుఎస్‌లో ఉంటున్న అక్రమ వలసదారులకు కంటిమీద కులుకు ఉండదు. వారిపై ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అని బెంబేలిత్తిపోతారు. ఎందుకంటే అధికారం చేపట్టి నాటి నుంచి ట్రంప్ ఫస్ట్ టార్గెట్ ఆ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని తరిమికొట్టడమే. వారిని దేశం నుంచి పంపించడానికి ట్రంప్ ఎన్నో కఠిన చట్టాలు తెచ్చారు. అయినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో వారు వెళ్లకపోవడంతో ప్రస్తుతం వారి కోసం యూఎస్ గవర్నమెంట్ ఒక డీల్ తెచ్చింది.
డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు క్రిస్మస్ ఆపర్ ప్రకటించింది. యూఎస్‌లో ఉంటున్న అక్రమ వలసదారులు ఎవరైతే తమ దేశాన్ని విడిచి వెళ్లాలనుకుంటారో వారికి డిపార్ట్‌మెంట్ ఆప్ హోమ్‌లాండ్ సెక్యురిటీ మూడు వేల డాలర్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా వారిపైన ఏవైనా జరిమానాలు, ఇతరత్రా ఏమైనా ఉన్నా రద్దు చేస్తామని పేర్కొంది.
దాని కోసం ఇది వరకే రూపొందించిన సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్‌ను ఉపయోగించాలని DHS తెలిపింది. అమెరికాను వదిలి వెళ్లాలనుకునేవారు CBP యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వారి వివరాలను అందులో నమోదు చేయాలని పేర్కొంది. ఆ తర్వాత వారి ప్రయాణ ఖర్చులు తదితర విషయాలను డిపార్ట్‌మెంట్ ఆప్ హోమ్‌లాండ్ సెక్యురిటీ సంస్థ చూసుకుంటుందని తెలిపింది. అక్రమ వలసదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DHS సెక్రటరీ క్రిస్టి నోయోమ్ తెలిపారు.
ఒకవేళ అక్రమంగా నివాసముంటూ తమకు పట్టుబడితే వారిని అరెస్టు చేసి బలవంతంగా వారి దేశాలకు పంపిస్తామని హెచ్చరించారు. గతంలో అమెరికా వదిలి అక్రమ వలసదారులకు ట్రంప్ వెయ్యి డాలర్లు చెల్లిస్తామని తెలిపారు. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 1.9 మిలియన్ల మంది స్వచ్ఛందంగా అమెరికాను వదిలి వెళ్లినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.


