నగల దుకాణంలో ‘అమ్మగారికి’ దేహశుద్ధి | Woman’s Attempted Jewelry Store Robbery In Ahmedabad Backfires, Shop Owner Fights Back After Chili Powder Attack | Sakshi
Sakshi News home page

నగల దుకాణంలో ‘అమ్మగారికి’ దేహశుద్ధి

Nov 8 2025 11:45 AM | Updated on Nov 8 2025 1:26 PM

Woman Throws Chilli Powder At Jeweller In Robbery Bid Gets Slapped 20 Times

నగలు, బట్టల దుకాణాల్లో చేతివాటం చూపించే మహిళా దొంగల గురించి చాలా వీడియోలు చూశాం.  కానీ నగల దుకాణంలో చోరీకి ప్రయత్నించి చావు దెబ్బల తిన్న వైనం నెట్టింట వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఒక ఆభరణాల దుకాణంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో  రికార్డైంది. 

నవంబర్ 3న మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన CCTVలో రికార్డయింది. దీని ప్రకారం అహ్మదాబాద్‌లోని రాణిప్ కూరగాయల మార్కెట్ సమీపంలోని బంగారం మరియు వెండి దుకాణంలోకి కస్టమర్‌గా ఒక మహిళ జ్యుయల్లరీ దుకాణంలోకి ప్రవేశించింది. దుపట్టా అడ్డం పెట్టుకుని, అదును చూసి దుకాణ యజమానిపై కారంపొడి చల్లి అందినంతా దోచుకోవాలని  ప్రయత్నించింది. కానీ అది కాస్త బెడిసి కొట్టింది. ఊహించని పరిస్థితి ఎదురైంది. మహిళ చోరకళను గుర్తించిన దుకాణదారుడు తక్షణమే అలర్ట్‌ అయిపోయాడు. వెంటనే లేచి  చెంపలు పగలగొట్టేశాడు. 25 సెకన్లలో దాదాపు దాదాపు 20 సార్లు కొట్టాడు. అయితే  ఈ సంఘటనకు సంబంధించి దుకాణదారుడు ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడని,   సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.  విచారణ జరుగుతోంని రాణిప్ పోలీస్ స్టేషన్ పిఐ కేతన్ వ్యాస్ తెలిపారు. అమ్మగారికి తగిన శాస్తి జరిగింది, సీన్‌ సితార్‌ అయ్యింది అంటు నెటిజన్లు పలు రకాలుగా వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: తండ్రి త్యాగం, కొడుకు సర్‌ప్రైజ్‌ : నెటిజనుల భావోద్వేగం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement