రహదారిపై ఒకదానితో మరోటి ఢీకొన్న పలు వాహనాలు
ఇద్దరు మృతి
16 మంది గాయాలు
అమేథీ(యూపీ): రహదారులపై పొగమంచు సంబంధ వాహన ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. సోమవారం అర్ధరాత్రిదాటాకా 2.30 గంటలప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లాలో రహదారిపై భారీగా పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు సరిగా కనబడక ట్రక్కు రోడ్డుపక్క రెయిలింగ్‌ను ఢీకొట్టగా దాని వెనుకొచ్చే వాహనాలు ఒకదానివెంట మరోటి ఢీకొని ధ్వంసమై శిథిలాల కుప్పగా మారాయి.
మొత్తం నాలుగు ట్రక్కులు, ఒక కారు, ఒక బస్సు ఢీకొన్న ఈ దుర్ఘటనలో వాహనాల్లో ఇరుక్కుపోయి ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. ముసాఫిర్‌ఖాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రహదారిపై అమేథీ–సుల్తాన్‌పూర్ మలుపు వద్ద జరిగింది.


