గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తిక మాసం, తిథి: బ.పాడ్యమి సా.4.52 వరకు, తదుపరి విదియ,నక్షత్రం: భరణి ఉ.8.41 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.7.50 నుండి 9.19 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.38 వరకు తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు, అమృత ఘడియలు: తె.4.43 నుండి 6.13 వరకు (తెల్లవారితే శుక్రవారం).
సూర్యోదయం : 6.04
సూర్యాస్తమయం : 5.24
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం... మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. పనులు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
వృషభం... ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
మిథునం.... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య సూచనలు. బంధువిరోధాలు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.
కర్కాటకం.... పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో విశేష గుర్తింపు రాగలదు.
సింహం... కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.
కన్య... కుటుంబసభ్యులతో వైరం. ఆరోగ్యభంగం. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు తథ్యం.
తుల...మిత్రులతో కలహాలు. రుణాలు చేయాల్సివస్తుంది. ప్రయాణాలు వాయిదా. దైవదర్శనాలు. అనారోగ్యం. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
వృశ్చికం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో ఆదరణ. పనులలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
ధనుస్సు...... శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూవివాదాల పరిష్కారం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.
మకరం...... రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విరోధాలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
కుంభం... వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు నెలకొంటాయి.
మీనం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సన్మానాలు పొందుతారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొంత ఉపశమనం లభిస్తుంది.


