ఈ రాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు.. వ్యాపారవృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 02-02-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు.. వ్యాపారవృద్ధి

Feb 2 2026 3:48 AM | Updated on Feb 2 2026 8:22 AM

Rasi Phalalu: Daily Horoscope On 02-02-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.పాడ్యమి రా.3.04 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: ఆశ్లేష రా.12.10 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: ప.1.15 నుండి 2.50 వరకు, దుర్ముహూర్తం: ప.12.35 నుండి 1.20 వరకు తదుపరి ప.2.52 నుండి 3.35 వరకు, అమృత ఘడియలు: రా.10.35 నుండి 12.10 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.36, సూర్యాస్తమయం: 5.52. 

మేషం... అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు. ఆలయ దర్శనాలు. పనులు మందగిస్తాయి.

వృషభం.... పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు. కాంట్రాక్టులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మిథునం.... కొన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుంటారు. దూరప్రయాణాలు. ఖర్చులు అధికం. మిత్రులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

సింహం.... ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగమార్పులు. 

కన్య... ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు. వ్యాపారవృద్ధి. వస్తు, వస్త్రలాభాలు. 

తుల... ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం... ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమా«ధిక్యం. అనారోగ్యం. పనులు వాయిదా. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. 

ధనుస్సు... కుటుంబంలో చికాకులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.

మకరం.... ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం. సన్నిహితుల సాయం పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కుంభం.... నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు హోదాలు. శుభవార్తలు.

మీనం.... వ్యయప్రయాసలు. పనుల్లో ఆటంకాలు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. వృథా ఖర్చులు. 

Advertisement
 
Advertisement
Advertisement