ప్రమాదాలు.. ఈ మధ్యకాలంలో తరచూ నెట్టింట చర్చకు దారి తీస్తున్నాయి. విమాన, ఘోర రోడ్డు ప్రమాదాలు, బస్సులు కాలిపోవడాలు.. జనాల వెన్నుల్లో వణుకులు పుట్టిస్తున్నాయి. తాజాగా.. జమ్ము కశ్మీర్‌లో ఓ విచిత్రమైన ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు.
జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ సమీపంలో శనివారం ఉదయం రైలు పైకి గద్ద దూసుకొచ్చింది. ఇంజిన్ అద్దాన్ని బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేసింది. ఈ ఘటనలో అద్దాల ముక్కలు గుచ్చకుని లోకో పైలట్ స్వల్పంగా గాయపడ్డాడు. బారాముల్లా–బనిహాల్ ప్యాసింజర్ ట్రైన్ బీజ్బెహారా -అనంత్‌నాగ్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనలో లోకో పైలట్ శ్రీ విషాల్ గాయపడ్డారు. దీంతో అనంత్‌నాగ్ రైల్వే స్టేషన్‌లో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైలును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తిరిగి ప్రయాణానికి అనుమతించారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారికంగా ప్రకటించారు.
అనంత్‌నాగ్ ప్రాంతం పక్షుల సంచారానికి ప్రసిద్ధి. ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సాధారణంగా విమానాలను పక్షులు ఢీ కొట్టే ఘటనలు చూస్తుంటాం. కానీ, ఇలా రైళ్లను ఢీ కొట్టడం చాలా అరుదైన అంశం. అందుకే వార్తల్లోకి ఎక్కింది. ఈ ఘటనపై ప్రాంతీయ రైల్వే అధికారులు పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఘటన సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అదంతా వీడియో తీశారు. ఈ ఘటనకు కారణమైన గద్ద.. లోపలికి వచ్చాక అక్కడే ఓ మూల కూర్చోవడం అందులో చూడొచ్చు.
In an unusual incident on the Srinagar–Anantnag route, an eagle crashed into the windshield of a moving train, injuring the driver and shattering the glass. The train was halted immediately to provide medical aid, while all passengers on board were declared safe.
Source:… pic.twitter.com/2Fed2O4rkV— Mid Day (@mid_day) November 8, 2025


