3 నుంచి 30 నిమిషాల దాకా సమయాల మార్పు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి రైలు వేళల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో జూలై 1 నుంచి రైళ్ల వేళలను మార్చే వారు. ఇప్పుడు దాన్ని జనవరి 1 నుంచి మారేలా సవరించారు. దేశవ్యాప్తంగా 1,400 రైళ్ల వేళలను సవరిస్తుండగా, దక్షిణమధ్య రైల్వే పరిధిలో 80కిపైగా రైళ్ల వేళలు మారుతున్నాయి. 3 నిమిషాల నుంచి గరిష్టంగా 30 నిమిషాల వరకు ఈ సమయాలను మారుస్తున్నారు. వేళలు మారిన రైళ్ల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.
జనవరి 1 నుంచి ప్రయాణాలు ఉన్నవారు మారిన రైళ్ల వివరాలను తెలుసుకుని తదనుగుణంగానే స్టేషన్‌కు రావాలని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 1 తర్వాత ప్రయాణాలకు ముందస్తుగా టికెట్లు రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు, వారు ప్రయాణించాల్సిన రైళ్ల వేళలు మారితే... ఆ సమాచారాన్ని మెసేజ్ రూపంలో వారికి పంపుతామని తెలిపారు.
కాగా, సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు తుది దశకు వచ్చిన నేపథ్యంలో, కొన్ని నెలలపాటు విడతల వారీగా కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో రైళ్ల రాకపోకలను నిలిపేయనున్నారు. తాజా మార్పులపై దీని ప్రభావం కూడా ఉండనుంది. ఇక ఇప్పటికే చర్లపల్లి టెరి్మనల్ అందుబాటులోకి వచి్చనందున చాలా రైళ్లను అక్కడి నుంచే నడుపుతున్నారు. త్వరలో మరికొన్ని రైళ్లు అక్కడి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనివల్ల కూడా కొన్నింటి వేళల్లో సవరణలు చోటుచేసుకుంటున్నాయి.


