రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి కళ్యాణ్ బెనర్జీ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు, తనలాంటి ప్రజా ప్రతినిధులు కూడా ఇలాంటి మోసాలకు బలైపోతే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వారిని ఎవరు రక్షిస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవీసీ అప్‌డేట్‌తో పేరుతో స్కామర్లు రూ. 57 లక్షలు మాయం చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వెస్ట్ బెంగాల్‌లోని సెరంపోర్ ఎంపి తనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఉందని, దానిని తాను చాలా కాలంగా దాన్ని పట్టించుకోవడం లేదని చెప్పారు. అయితే నకిలీ KYC అప్‌డేట్ పేరుతో తన ఫోటోను సూపర్ ఇంపోజ్ చేసి, పాన్ ,ఆధార్‌ను తప్పుగా ఉపయోగించి మోసానికి పాల్పడ్డారని తెలిపారు. అయితే ఏదో అంతర్గత లోపం వల్ల జరిగిందని చెప్పిన SBI తన ఖాతాలో రూ. 57 లక్షలు జమ చేసిందని చెప్పారు. (ఎంపీకి స్కామర్ల షాక్ : ఎస్‌బీఐ నుంచి రూ.56 లక్షలు మాయం)
అయితే తనలాంటి వ్యక్తుల ఖాతాలే బ్యాంకు మోసాల బారిన పడితే, ఇక, సామాన్యులెలా ఎదుర్కొంటారు? ఆర్థిక మంత్రిత్వ శాఖ సైబర్ మోసాల నిరోధక విభాగాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని కణ్యాణ్ బెనర్జీ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఎస్‌బీఐ కోల్‌కతా పోలీసుల సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేయాలని కోల్‌కతా పోలీసు సీనియర్ అధికారులను ఆదేశించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఇదీ చదవండి: దెయ్యం పట్టిందని మద్యం, బీడీ తాగించి, మహిళకు చిత్రహింసలు


