ఎంపీకి స్కామర్ల షాక్‌ : ఎస్‌బీఐ నుంచి రూ.56 లక్షలు మాయం | Trinamool Kalyan Banerjee loses Rs 56 lakh after scammers break into bank account | Sakshi
Sakshi News home page

ఎంపీకి స్కామర్ల షాక్‌ : ఎస్‌బీఐ నుంచి రూ.56 లక్షలు మాయం

Nov 7 2025 4:33 PM | Updated on Nov 7 2025 6:24 PM

Trinamool Kalyan Banerjee loses Rs 56 lakh after scammers break into bank account

చిన్నా పెద్దా అనే తేడా లేదు. అకౌంట్లో  భారీ ఎత్తున డబ్బులున్నాయని పసిగడితే చాలు.  ఆన్‌లైన్ స్కామర్లు వాలిపోతారు.  లక్షలకు  లక్షలకు, ఒక్కోసారి కోట్ల  రూపాయలు కొల్లగొడుతున్నారు.  తృణమూల్ పార్టీకి చెందిన కళ్యాణ్ బెనర్జీ బ్యాంకు ఖాతాలోకి స్కామర్లు చొరబడి రూ.56 లక్షలు  మాయం చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పశ్చిమ బెంగాల్‌లోని సెరంపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు(ఎంపీ) కళ్యాణ్ బెనర్జీకి చెందిన కోల్‌కతాలోని హైకోర్టు శాఖ,  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి స్కామర్లు చొరబడి  రూ.56 లక్షలు దోచేశారు.  కోల్‌కతా పోలీసుల సైబర్ క్రైమ్ సెల్‌కు బ్యాంక్ అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

బ్యాంక్ ఫిర్యాదు ప్రకారం,  అక్టోబర్ 28న సైబర్ నేరగాడు  నకిలీ పాన్ , ఆధార్ కార్డులను సూపర్ ఇంపోజ్డ్ ఫోటో , నకిలీ ఫోన్‌నెంబరు KYC వివరాలతో బెనర్జీ అకౌంట్‌ను అప్‌డేట్‌ చేశాడు.  దీంతో ఖాతాపై పూర్తి నియంత్రణ లభించింది. ఈ తర్వాత, ఆ వ్యక్తి బహుళ ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించాడని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా దాదాపు రూ. 56,39,767ను దొంగిలించాడని ఆరోపించారు. ఇలా కొట్టేసిన మొత్తాన్ని అనేక మంది లబ్ధిదారుల ఖాతాలకు  ట్రాన్స్‌ఫర్‌  చేశాడు. కొంత ATMల ద్వారా విత్‌డ్రా చేసి,ఆభరణాలను కొనుగోలు చేయడానికి కూడా ఉపయోగించాడని పోలీసు అధికారులు తెలిపారు.

 చదవండి: రూ.1800 కోట్ల భూమి 300 కోట్లకే : భగ్గుమన్న భూ కుంభకోణం ఆరోపణలు
2010 నాటి హత్య కేసు.. 2025లో ఛేదించారు ఇలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement