గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తిక మాసం, తిథి: బ.తదియ ప.12.09 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: మృగశిర రా.3.47 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: ప.10.34 నుండి 12.04 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.57 నుండి 7.38 వరకు, అమృత ఘడియలు: రా.7.34 నుండి 9.04 వరకు, సంకటహరచతుర్ధి.
సూర్యోదయం : 6.02
సూర్యాస్తమయం : 5.27
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా వ్యతిరేకత. ధనవ్యయం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం.
వృషభం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మిథునం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. పాతమిత్రుల కలయిక. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.
సింహం: మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
కన్య: పనుల్లో అవాంతరాలు. కొత్తరుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
తుల: కుటుంబసమస్యలు. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో కొత్త చిక్కులు. ఉద్యోగాలలో పనిభారం.
వృశ్చికం: ఆకస్మిక ధనలాభం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి.
ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో విజయం. సోదరుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలత.
మకరం: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు.
కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆత్మీయులతో విభేదాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
మీనం: సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.


